వెరీ హాండ్సమ్ మిలిటరీ ఆఫీసర్ – Super Star Mahesh Babu’s SARILEU NIKEVVARU
1 min readవెరీ హాండ్సమ్ మిలిటరీ ఆఫీసర్
కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం సరిలేరు నీకెవ్వరు మొదటి టీజర్ విడుదలైంది. ఎన్నో రోజుల నుండి ఆయన అభిమానులు దీనికోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇక విడుదలైన నిమిషం నుండి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ టీజర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ లో “మీరెవరో మాకు తెలియదు మీకు మాకు ఏ రక్త సంభందం లేదు కాని మీకొసం మీ పిల్ల కోసం పగలు రాత్రి ఎండ వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం, ఎందుకంటే మీరు మా బాధ్యత “ అనే డైలాగ్ తో మొదలవుతుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు ఒక మిలిటరీ ఆఫిసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే మహేష్ బాబు లుక్ పై చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే తన లుక్ మిలిటరీ ఆఫిసర్లలా ఉండకపోవడమే. ఇంకా చెప్పాలంటే వెరీ వెరీ హాండ్సమ్ మిలిటరీ ఆఫీసర్ అని చెప్పొచ్చు. సాధారణంగా మిలిటరీ ఆఫీసర్ అంటే ఫిట్ బాడీతో, మిలిటరీ హెయిర్ కట్ తో ఉంటారని అందరు ఊహించుకున్నారు. కాని సూపర్ స్టార్ మహెష్ తన రెగ్యులర్ లుక్ తో హాండ్సమ్ మిలిటరీ ఆఫిసర్ గా కనిపించి అందరిని ఆశ్చర్య పరిచినా, టీజర్ రిలీజ్ అయిన తరువాత ఆ విషయాన్ని అందరు మరిచిపోయి, ఈ టీజర్‌ని రికార్డులతో ముందుకు తీసుకెలుతున్నారు.
ఈ టీజర్‌ని పూర్తిగా గమనిస్తే మహెష్ బాబు సినిమా మొత్తం మిలిటరీ లుక్‌లో కనిపించక పోవోచ్చని అర్ధమవుతోంది.
ఇందులో సూపర్ స్టార్ మహెష్ బాబు తర్వాత మట్లాడుకోవాల్సింది లేడీ అమితాబ్ విజయశాంతి. చాలా రోజుల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్ ఈ సినిమాకి హైలెట్ అని ట్ ఈజర్ చూస్తే తెలుస్తుంది.
ఆమె చెప్పే డైలాగ్ ” గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్ “ ద్వారానే ఈ సినిమా కథ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్ధమవుతోంది.
ఈ టీజర్‌ని చూస్తే ఇది ఒక ఊరిలో రాజకీయ నేపద్యంగా జరిగే కుట్రలను అరికట్టే మిలిటరీ ఆఫిసర్ మహెష్ బాబు, తన ఊరిని రాజకీయ కక్షలనుండి కాపాడే వ్యక్తి కోసం ఎదురు చూసే పాత్రలో విజయశాంతి నటిస్తున్నట్టు అర్ధమవుతోంది.
ఇక ప్రకాష్ రాజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎప్పటిలాగే విలన్‌గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ చెప్పే ” ప్రతి సంక్రాంతికి అల్లుల్లు వస్తారు ఈ సంక్రాతికి మొగుడు వచ్చాడు” అనే డైలాగ్‌తో మహెష్ బాబు, ప్రకాష్ రాజ్‌ని ఏ రేంజ్‌లో ఆడుకుంటాడో అర్ధమవుతుంది.
అయితే ఈ టీజర్‌లో మహేష్ బాబు యాక్షన్ పార్ట్ మాత్రమే చూపించారు. ఇందులో హీరోయిన్, కామిడీ సీన్స్ ఏవీ చూపించలేదు.
అయితే అనిల్ రావిపూడి సినిమాలంటే తప్పకుండా కామిడీ ట్రాక్ ఉంటుంది. తన మొదటి సినిమా పటాస్ నుండి మొన్న వచ్చిన ఎఫ్ 2 వరకు గమనిస్తే ఒక స్పెషల్ కామిడీ ట్రాక్ ఉంది. అవి ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుదు సరిలేరు నీకెవ్వరు సినిమాలో కామిడీ ట్రాక్ ఎలా ఉండబోతోందని ఫాన్స్‌తో పాటు, సాదారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఇవన్ని తెలియాలంటే మనం వచ్చే నెల సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.


Really very happy to say that your post is very interesting. I never stop myself to say something about it. You did a great job. Keep it up.We have an excellent information in cinema industry. We are showing updated news that are very trendy in the film industry. For further information, please once go through our site.
Tollywood Gossips in Telugu