తిరుపతిలో శ్రీవారి లడ్డూలు ఉచితం: కరోనా ఎఫెక్ట్
1 min readతిరుపతిలో శ్రీవారి లడ్డూలు ఉచితం: కరోనా ఎఫెక్ట్
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలకు చాపకింద నీరులా పాకుతోంది. దీనికి మన దేశం మినహాయింపేమీ కాదు. కరోనా ప్రభావం మన దేశంలోని ప్రధాన ఆలయాలపై కూడా పడింది.
ప్రతీరోజు కిక్కిరిసిన జనంతో శోభిల్లే తిరుపతి శ్రీవారి ఆలయంలో అన్ని దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసారు. దీంతో ఎవరు ఊహించని విధంగా తిరుపతి భక్తులు లేక వెలవెల బోతోంది.
ఈ క్రమంలో భక్తులకోసం చేసిన లడ్డూలు విక్రయాలు లేక అలాగే ఉండి పోయాయి. దాదాపు 2 లక్షల లడ్డూలు మిగిలాయని సమాచారం.
అయితే ఈ లడ్డూలను తితిదే సిబ్బందికి ఉగాది కానుకగా ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.

