తెలంగాణలో రేపు 24 గంటలు బంద్
1 min read
తెలంగాణలోరేపు 24 గంటలు బంద్
తెలంగాణాముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,రేపు తెలంగాణాలో 24 గంటలబంద్ని పాటించాలని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ ఉదయం 7 గంట నుండి రాత్రి9 గంటల వరకు ఉంటే, తెలంగాణాలో మాత్రం ఉదయం 6 గంటల నుండి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు ఉంటుందనిసి.యం కె సిఆర్ ఇవ్వాల జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రకటించారు.
ఈ బంద్ సమయంలో ఆర్టీసిసేవలు, మెట్రో రైలు సేవలు మూసివేస్తున్నట్టుప్రకటించింది. అంతరాష్ట్రీయ బస్సు సర్విసులను కూడా రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది.
కరోనవ్యాప్తి నివారణకు ప్రజలంతాసహకరించాలని పిలుపునిచారు.
విదేశాలనుండివచ్చినవారు దయచేసి రిపోర్ట్ చేయండి, మీకు చేతులెత్తి దండంపెడుతున్న అని సియం కెసి ఆర్ అన్నారు. సమాజానికి ముప్పు తీసుకు రావొద్దు అని ఆయన అన్నారు.
