May 12, 2025

Digital Mixture

Information Portal

బాలీవుడ్‌లో “అలా వైకుంఠపురములో సినిమా రిమేక్” ….. మరి హీరో ఎవరు?

1 min read

బాలీవుడ్‌లో “అలా  వైకుంఠపురములో సినిమా రిమేక్” ….. మరి  హీరో ఎవరు?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన “అలా వైకుంఠపురములో” సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. మ్యూజిక్ పరంగా, సినిమా పరంగా ఈ సినిమా చాలా రికార్డులను క్రియేట్ చేసింది.  అయితే ఈమధ్య  బాలీవుడ్ సౌత్ ఇండియన్ మూవీస్‌పై ఒక కన్నేసి ఉంచుతోంది. బాహుబలి సీరిస్ పుణ్యమా అని బాలీవుడ్ మొత్తం  సౌత్ ఇండస్ట్రీ వైపు చూడడం మొదలు పెట్టింది.

అయితే తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్‌లో రిమేక్ అవ్వడం చూస్తున్నాం. ఇప్పుడు “అలా  వైకుంఠపురములో” బాలీవుడ్‌లోకి వెల్లబోతోంది. ఈ సినిమా హింది రిమేక్ హక్కులను అశ్విన్ వర్దే (Ashwin Varde) సొంతం చేసుకున్నారు.

అయితే బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి అన్నిరకాల పనులు పూర్తైనట్లు తెలుస్తోంది, కానీ హీరో కోసం వెతుకుతూనే ఉన్నరట. అయితే బాలీవుడ్ ఇండుస్త్రీలో ఇప్పుడొక వార్త చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా చేయబోతున్నాడు. 

ఈ వార్తలో  నిజము ఉండే  అవకాశం ఉంది. ఎందుకంటే అక్షయ్ కుమార్  సూపర్ హిట్ సౌత్ ఇండియన్ మూవీస్ రిమేక్స్‌లో నటించారు. చంద్రముఖి, తుపాకి, ఠాగూర్, విక్రమార్కుడు లంటి సినిమాల్లో నటించి బ్లాక్‌బస్టర్   హిట్స్‌ని అందుకున్నాడు. అక్షయ్ కుమార్ ఏదైన రీజినల్ మూవి నచ్చితే దాన్ని రేమేక్  చేయడానికి ఎప్పటికి ముందుంటాడనే చెప్పాలి.

కాబట్టి ఈ రూమర్ నిజం  కూడా కావొచ్చు. కానీ అఫీషియల్‌గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. అలాగే దీనికి దర్శకత్వం ఎవరు అన్నది కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే దేశంలో లాక్‌డౌన్ ఉన్నందున, దాని తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *