May 12, 2025

Digital Mixture

Information Portal

రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు

1 min read

రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు

రాజమౌళి, ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సీరిస్ తరువాత మన జక్కన్న ఏకంగా టాలీవుడ్ నుండి బాలీవుడ్, హాలీవుడ్ రేంజికి వెళ్ళిపోయాడు. జక్కన్నతో ఒక్క సినిమా అన్న తప్పకుండా చేయాలని టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరు స్టార్ హీరోలు, యాక్టర్లు వేచి చూస్తున్నారు. 
అయితే ఎప్పటినుండో ఒక కాంబినేషన్ కోసం ఫాన్స్‌తో పాటు సినీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అదే సూపర్ స్టార్ మహెష్ బాబు, రాజమౌళి కాంబినేషన్. చాలా సార్లు ఇటు రాజమౌళి అటు మహేష్ బాబు అవకాశం వస్తే తప్పకుండా చేస్తాం అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది నిజం కాబోతోందని తెలుస్తోంది. 
రాజమౌళి ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దానయ్య గారి సినిమా తరువాత, కె ఎల్ నారాయణ గారి నిర్మాణంలో మహేష్ బాబు గారితో సినిమా ఉంటుందని ప్రకటించాడు. దీంతో మహేష్ ఫాన్స్ ఆనందానికి ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు.   
ప్రస్తుతం రాజమౌళి జూ. ఎన్ టి ఆర్, రామ్  చరణ్ కాంబినషన్‌లో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని జనవరి 8, 2021 కి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  దీని తర్వాత మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశముంది.  
ప్రస్తుతం మహేష్ బాబు గీతా గోవిందం ఫేం పరుశరాం తో సినిమా చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *