May 12, 2025

Digital Mixture

Information Portal

100 మిలియన్లను రీచ్ అయిన నీలి నీలి ఆకాశం పాట ….

1 min read

మొదటి సినిమాతోనే అరుదైన  రికార్డుని క్రియేట్ చేసిన ప్రదీప్   


ప్రదీప్ మాచిరాజు ఈ పేరు తెలియని ఇళ్ళు ఉండదేమో అంటె అతిశయోక్తి కాదు. ఎందుకటే ఈయన  గత కొద్ది సంవత్సరాలుగా తన యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వివిధ రకాల షోస్ చేస్తూ, కామిడీ టైమింగ్‌ని  మెంటైన్ చేస్తూ  బుల్లితెర  ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకొని టి్ఆర్‌పి రేటింగ్ పెంచుతున్నాడు.
అయితే ప్రదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ చూసాక, సినిమాల్లో కూడా  హీరోగా అవకాశం వచ్చింది. మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమిచడం ఎలా చేసాడు. అయితే ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా ఇంకా విడుదల కాలేదు.
కానీ ఇందులోని లిరికల్ సాంగ్స్‌ని రిలీజ్ చేసారు.  అందులో  ఒకటి నీలి నీలి ఆకాశం పాట. ఈ పాట విడుదలై సినిమాపై చాలా క్రేజ్‌ని పెంచేసింది. అనూప్  రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటను చంద్రబోస్ రాయగా, సిద్ శ్రీరాం మరియు సునిత పాడారు.
ఈ పాట యూట్యూబ్‌లో సంచలనాలను క్రియేత్ చేస్తోంది. తాప్ హీరోలను సైతం ఆశ్చర్య పరిచేలా యూట్యూబ్‌లో రికార్డ్‌ని క్రియేట్ చేసాడు. రీసెంట్‌గా  యూట్యూబ్‌లో 100 మిల్లియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకొంది. 
తొలి సినిమాతోనే ఈ ఫీట్‌ని సాధించడంపై తన ఫ్రెండ్స్, ఫాన్స్ ఆనదంలో ఉన్నారు.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *