100 మిలియన్ క్లబ్‌లో చేరిన ఇస్మార్ట్ శంకర్ దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్
1 min read100 మిలియన్ క్లబ్‌లో చేరిన ఇస్మార్ట్ శంకర్ దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్
రామ్ , పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. పూరి జగన్నాధ్‌కి కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ ఇచ్చిన సినిమా. ఈ సినిమాకి పూరి జగన్నధ్ ప్రొడ్యూసర్.
ఈ సినిమా విడుదలై సంచలనాలను క్రియేట్ చేసింది. ఇందులో ముఖ్యంగా పాటల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్వర బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు ఒక రకంగా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు.
ఈ పాటలు విడుదల అయినప్పట్టి నుండి మంచి క్రేజిని సంపాదించుకున్నాయి. గతంలో పూరి జగన్నధ్, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సినిమా పాటలు ఎంత పెద్ద విజయన్ని సాధించాయో కొత్తగా చెప్పనక్కర్లేదు.
ఈ చిత్రంలోని దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట థియేటర్‌లో ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. ప్రేక్షకులతో స్టెప్పులు వేయించింది. ఈ పాట యూట్యూబ్‌లో కూడా తన ప్రతాపాన్ని చూపెట్టింది. రికార్డులను క్రియేట్ చేసింది. రీసెంట్‌గా ఈ వీడియో సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించి కొత్త రికార్డును సొంతం చేసుకుంది.

