May 12, 2025

Digital Mixture

Information Portal

100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు టాలీవుడ్ సినిమాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు శ్రీమంతుడు

1 min read

100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు  టాలీవుడ్ సినిమాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు శ్రీమంతుడు.  
సూపర్‌స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా మంచి సోషల్ మెసేజ్ మరియు ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో మహేష్‌బాబు ఒక ఊరిని దత్తత తీసుకొని ఎలా అభివృద్ధి చెయ్యొచ్చొ చూపెట్టారు. ఇందులో మహేష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో మహేష్ లుక్ మరియు కాస్ట్యూమ్  విషయంలో కొత్తగా కనిపించాడు.             

ఈ సినిమా 83 కోట్ల షేర్‌ని వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్‌లో కూడా కొత్త రికార్డును క్రియేట్ చేసింది.

టాలీవుడ్‌లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా యూట్యూబ్‌లో రికార్డులను నెలకొల్పింది. తమ హీరో సినిమా, రికార్డులను క్రియేట్ చేయడంతో, ఫాన్స్ ఆనందాల్లో మునిగి తేలుతున్నారు.
శ్రీమంతుడు తర్వాత స్థానంలో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ డిజె – దువ్వాడ జగన్నాధం 76 మిలియన్ వ్యూస్, నాచురల్ స్టార్ నాని నేను లోకల్ 75 మిలియన్ వ్యూస్‌తో ఉన్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు, గీతా గోవిందం ఫేం పరుశరాం దర్శకత్వంలో పనిచేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి.             
 
CLICK HERE to watch Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *