May 13, 2025

Digital Mixture

Information Portal

తండ్రి పుట్టినరోజున మహేష్ బాబు ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే సర్ప్రైజ్

1 min read

తండ్రి పుట్టినరోజున మహేష్ బాబు ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే సర్ప్రైజ్

ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న మహేష్ బాబు  కొత్త సినిమా విశేషాలు ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. మహేష్ బాబు చాలా కథలు విన్నాడు. చాలామంది దర్శకుల పేర్లు మహష్ బాబుతో సినిమా కొత్త సినిమా చేస్తున్నట్టు పుకార్లు వచ్చాయి. కానీ గత రెండు రోజుల నుండే ఈ సినిమా టైటిల్ బయటకొచ్చింది. అయితే దీనికి మహేష్ బాబు రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9.09 ని.లకు అన్ని విషయాలు తెలుస్తాయి అని మెసేజ్ పాస్ చేసాడు.

అన్నట్టుగానే  ఈరోజు ఉదయం మహేష్ బాబు చేయబోయే నెక్స్ట్ సినిమా విశేషాలను ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్ తో ఉండే  పోస్టర్ ని మహేష్ బాబు  twitter ద్వారా విడుదల చేసారు. “మరో హాట్రిక్ కోసం బ్లాక్బస్టర్ ఆరంభం” అని పేర్కొన్నారు. మహేశ్ బాబు కొత్త సినిమా పేరు సర్కారు వారి పాట. దీనికి గీత గోవిందం ఫేం పరుశరాం దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, 14  రీల్స్ తో పాటు  GMB ద్వారా మహేష్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈసినిమాకి సంగీతం థమన్  అందిస్తున్నాడు. చాలా రోజుల తరువాత థమన్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తోంది.


మహష్ లుక్ పూర్తిగా ఇందులో కనబడకుండా సస్పెన్స్ గా పెట్టారు. కానీ మహేష్ లుక్ మాత్రం చాల కొత్తగా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మహేష్ చెవి పోగు అలాగే  మెడపై పాత ఒక రూపాయి కాయిన్ టాటూ కూడా కనిపిస్తుంది. ఫుల్ మాస్ లుక్ లో ఆదరగోత్తనున్నాడని అర్ధమవుతోంది.  ఇంకొక విషయం సినిమా టైటిల్ లో గంట గుర్తుని గమనించవచ్చు. అయితే ఇందులో మహేష్ బాబు  డ్యుయల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. ఈ పోస్టర్ చూసి మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారనే చెప్పొచ్చు. ఇతర నటీనటుల విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *