బ్రేకింగ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రం, కొమరం భీం జిల్లాలో ఎస్‌పిఎం పేపర్ మిల్లులో గ్యాస్ లీక్.
1 min readబ్రేకింగ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రం, కొమరం భీం జిల్లాలో ఎస్‌పిఎం పేపర్ మిల్లులో గ్యాస్ లీక్.
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరవక ముందే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ ఎస్‌పిఎం పేపర్ మిల్లులో గ్యాస్ లీక్ అయ్యింది.
ఈరోజు ఉదయం జరిగిన ఈ సంఘటనలో నాగుల రాజం అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. బాధితుడిని ఆసుపత్రిలో చేర్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను పరిశ్రమ యాజమాన్యం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నట్లు సమాచారం.

