వారితో కలిసి నటించడం నా అదృష్టం : చిరంజీవి
1 min read
వారితో కలిసి నటించడం నా అదృష్టం : చిరంజీవి
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి పుట్టినరోజు ఈరోజు. ప్రతీ సంవత్సరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆడంబరంగా జయంతి వేడుకలు జరిగేవి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూ. ఎన్టిఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా పలువురు సిని ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనను స్మరించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, స్వర్గీయ నందమూరి తారక రామారావుగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. తెలుగు జాతి పోరుషం, తెలుగు వారిఆత్మా గౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం… నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం… వారితో కలిసి నటించడం నా అదృష్టం అని చిరంజీవి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారికి స్వీట్ తినిపిస్తున్న ఫోటోని twitter ద్వారా పంచుకున్నారు.

