ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్
1 min read
ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో దేశవ్యాప్తంగా బాగా పేరు తెచ్చుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. సుశాంత్ (34) ఈరోజు ముంబయి లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సుశాంత్ టెలివిజన్ రంగంలో నటుడిగా కొనససాగుతూ, 2013 లో కై పో చీ చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమయ్యాడు. తరువాత శుద్ద్ దేశీ రోమాన్స్, పీకే చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత నీరజ్ పాండే దర్శకత్వంలో, భారత క్రికెట్ జట్టు కెప్టైన్ ఎం.ఎస్.ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో, ఒక్కసారిగా అటు బాలీవుడ్ మరియు దేశం దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేసాడు. ‘రాబ్తా’, ‘వెల్‌కమ్ న్యూయార్క్’, ‘కేదార్‌నాథ్’, ‘సొంచిరియా’, ‘చిచ్చోరే’, ‘డ్రైవ్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం దిల్ బెచరా షూటింగ్ దశలో ఉంది.

పోలీసుల ప్రాధమిక విచారణలో, సుశాంత్ గత 6 నెలలుగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని అందుకే ఈ ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది.
అయితే తన స్నేహితులు కుడా ఈ విషయం గురించే ప్రస్తావించడం జరిగింది. అయితే నిన్న రాత్రి, సుశాంత్, స్నేహితులను తన ఇంట్లోనే కలవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఇళ్ళు శుభ్రం చేసే వ్యక్తి వచ్చి వెళ్లి మరల మధ్యాహ్నం తిరిగి వచ్చే వరకూ కూడా సుశాంత్ గది తెరిచిలేకపోవడంతో నిద్రలేపడానికి ప్రయత్నించాడు. ఎంతకు లేవకపోవడంతో, సుశాంత్ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పడంతో, వారు వచ్చి తలుపులను బద్దలు కొట్టారు. అప్పటిలే ఉరేసుకొని ఉన్న సుశాంత్ ని చూసి పోలీసులకు సమాచారాన్ని అందించారు.
సుశాంత్ ఆత్మహత్యకి గల కారణాలు తెలియరాలేదు. సుశాంత్ గది నుండి ఎలాంటి సూసైడ్ నోట్ లాంటివేవి లభించలేదు.
ఈ వార్తతో బాలీవుడ్ తో సహా యావత్ భారతదేశం షాక్ కి గురైంది. ప్రధాని నరేంద్ర మోడీ తో సహా అన్ని సినిమా ఇండస్ట్రి సేలేబ్రిటిలు, సచిన్ తో పాటు, పలువురు క్రికెటర్లు సుశాంత్ ఆత్మహత్యపై ఆవేదన వ్యక్తం చేసారు.
