May 12, 2025

Digital Mixture

Information Portal

ఈరోజు నుండి జబర్ధస్త్ హంగామా షురూ…..

1 min read

ఈరోజు నుండి జబర్ధస్త్ హంగామా షురూ…..

తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడి షోది ఒక ప్రేత్యేక స్థానం అని చెప్పొచ్చు. ఈ షోకి దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ షోకి యుట్యుబ్ లో అభిమానులు కూడా చాలా ఎక్కువనే చెప్పొచ్చు. అలాంటి గత  మూడు నెలల నుండి కరోనా వల్ల ఆగిపోయిన సంగతి  తెలిసిందే.

ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం అన్ని సినిమా, టీవీ షూటింగులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జబర్దస్త్ , ఎక్ష్త్రా జర్బర్దాస్త్ లు కొత్త జోష్ తో ముస్తాబయ్యాయి. ఈ మధ్యే విడుదల అయిన ప్రోమోలు చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది.

విడుదల అయిన రెండు ప్రోమోలకు మంచి ఆదరణ లభించింది. అన్ని రుమార్లకు చెక్ పెడుతూ, అనసూయ, రష్మి లు వాళ్ళ యాంకరింగ్ ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ కొన్ని పాత టీం లకి బై బై చెప్పగా కొత్త టీం లకు స్వాగతం చెప్పారు. అందులో ముఖ్యంగా తాగుబోతు రమేష్ ని లీడర్ గా కొత్త టీం పరిచయమవగా, పాత జబర్దస్త్ కమెడియన్ శకలక శంకర్ కొత్త టీం తో రీ ఎంట్రీ ఇచ్చారు.

Courtesy: Youtube, mallemalatv

అందరూ ఉహించినట్టుగానే హైపర్ ఆది తన స్కిట్లలో కరోనాని కూడా వాడుకుంటూ పంచులు వేసి కామిడి పండించాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన బాలకృష్ణ కొత్త సినిమా టిజర్లో  చెప్పిన డైలాగ్ తో మరోసారి  కామెడి పండించాడు.

అయితే కొత్తగా ఎంటర్ అయిన తాగుబోతు రమేష్ కూడా ఆసక్తికర పంచులు వేసి అందరిని ఆకట్టుకున్నాడు.

అయితే కొద్దిరోజులుగా జబర్దస్త్ యాకర్లు,జడ్జిలపై రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దానికి సమాధానమే ప్రోమో అని చెప్పొచ్చు.  యాంకర్లతో పాటు జడ్జి లు  కూడా కంటిన్యూ అవుతున్నారు.

ఇక జబర్దస్త్ యాజమాన్యం , అభిమానులకు కొత్త టీం లతో కొత్త జోష్ ని అందించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *