మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ రాబోతోందా…
1 min read
Image Source: Google
మహేష్ బాబు, జూ.ఎన్‌టీఆర్ కాంబినేషన్లో మూవీ ప్లాన్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్….
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ తీయడానికి, చేయడానికి నిర్మాతలు, బడా హీరోలు ముందుకొస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి కథ నచ్చితే ఏ హీరో అయినా ఇంకొక హీరోతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వం జూ. జూ.ఎన్‌టీఆర్, రామ్ చరణ్ కలిసి ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక వార్తా చక్కర్లు కొడుతోంది. బడా నిర్మాతల్లో ఒకరైన మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ మహేష్ బాబు, జూ.ఎన్‌టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇది వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే ఆవకాశం ఉంది. దీనికి మహేష్ బాబు, జూ. ఎన్‌టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. వీరిద్దరి స్టార్ స్టేటస్ కి తగ్గట్టు కథ తయారు చేయిస్తున్నారట అల్లు అరవింద్. దీనికోసం టాప్ రైటర్స్ తమ కలానికి పని చెపుతున్నట్టు సమాచారం. దీనిగురించి అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇదేగనక నిజమైతే ఆయా హీరోల అభిమానుల సంతోషానికి ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు.
ప్రస్తుతం మహేష్ బాబు పరుశరాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా, జూ.ఎన్‌టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.
