May 12, 2025

Digital Mixture

Information Portal

కొరటాల శివ తో తన 21 వ మూవీని ప్రకటించిన అల్లు అర్జున్…

1 min read

Image Source: Twitter / Allu Arjun

ఎన్నోరోజులుగా ఒక వార్త సినిమా ఇండస్త్రిలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లుఅర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రాబోతోందని. ఈరోజు అల్లు అర్జున్ ప్రకటనతో ఆ విషయం నిజమే అని తేలింది. అల్లు ర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రాబోతోంది. ఈరోజు అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా తన 21 వ సినిమా కొరటాల శివతో చేయబోతున్నట్టు  ప్రకటించాడు.  ఈ సినిమా 2022 వ సంవత్సరం వేసవికి విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాను అల్లు అర్జున్ బంధువులు నిర్మిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ మరియు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. హిరోయిన్ మరియు ఇతర నటీనటుల గురించిన విశేషాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బన్ని సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఇంకా మొదలు కాలేదు.

అల్లు అర్జున్ ఈ కరోనా టైమ్ ని వృధా చేయకుండా తన తరువాత సినిమాలకు సంబంధించిన కథలను, దర్శకులను లాక్ చేసి పెట్టుకుంటున్నాడని అర్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *