కూతురి కోసం మెగాస్టార్ చిరంజీవి వెబ్ సీరిస్ లో నటించనున్నారా?
1 min read
కూతురి కోసం మెగాస్టార్ చిరంజీవి వెబ్ సీరిస్ లో నటించనున్నారా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హిరోలందరూ ఒక స్థాయికి వచ్చాక వారు తమ సొంత నిర్మాణ సంస్థలను స్టార్ట్ చేస్తున్నారు. ఇది పాత తరం హీరోల దగ్గరనుండే వస్తోంది. ఎన్టిఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోలు అప్పట్లో సొంత స్టూడియోలు, నిర్మాణ సంస్థలకు పునాది వేసారు. దాని తరువాత తరం కూడా చాలా మంది హీరోలు దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంటినుండి ఇంతకుముందు నాగబాబు ఆద్వర్యంలో ఒకటే నిర్మాణ సంస్థ ఉండేది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరుతో ఒక బ్యానర్ కూడా స్థాపించారు. తరువాత రామ్ చరణ్ హీరోగా ఎదిగాక కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసిన సమగతి తెలిసిందే. 2017 లో చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం.150 తో ప్రారభమైన ఈ సంస్థ, తరువాత సైరా నిర్మించారు. ఇప్పుడు ఆచార్య సినిమాకు కూడా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు.
మెగాస్టార్ ఇంటినుండి మరో ప్రొడక్షన్ హౌస్ రాబోతోంది. మెగాస్టార్ కూతురు సుస్మిత నిర్మాతగా మారబోతోంది. చాలా రోజులుగా రూమర్ గా ఉన్న ఈ న్యూస్ నిజమే అని తేలింది. సుస్మిత తన భర్త విష్ణు తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్తైన్మెంట్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సుస్మిత కాస్ట్యుం డిజైనర్ గా ప్రేక్షకులకు పరిచయమే. చిరంజీవి, రాం చరణ్ సినిమాలకు సుస్మిత కొణిదెల కాస్ట్యుం డిజైనర్ గా పని చేసారు. రంగస్థలం, ఖైదీ నెం. 150 , సైరా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు పని చేసారు.
అయితే ఈ సంస్థ ద్వారా ప్రస్తుతానికి వెబ్ సీరిస్ నిర్మించబోతున్నారు. ఓయ్ సినిమా దర్శకుడు ఆనంద్ రంగా ఈ వెబ్ సీరిస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సీరిస్ పోలీసులకు, క్రిమినల్స్ కి మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ వెబ్ సీరిస్ లో ఒక చిన్న పాత్రని చేయమని తండ్రిని రిక్వెస్ట్ చేస్తోందట సుస్మిత. దానికి మెగాస్టార్ నటిస్తానో లేదో అని డైలమాలో ఉంచారని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో క్లారిటీ రానుందని సమాచారం.
