ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలు ఇవే….
1 min read
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలు ఇవే….
తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు ఎక్కువ కరోనా ప్రబలుతున్న సిటీల్లో ఒకటిగా చేరింది. ప్రతిరోజు తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలోనే నమోదవుతుండటం అటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోందని చెప్పొచు. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులకు కూడా కరోనా పాజిటివ్ రావడం కలవరపెడుతోంది.
ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను హైరిస్క్ జోన్లగా అధికారులు గుర్తించారు. 500 కేసులు అంతకంటే ఎక్కువగా నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లగా పరిగణించడం జరిగింది. దీని ప్రకారం ఇప్పటి వరకు సిటీలో 8 హైరిస్క్ జోన్లు ఉన్నట్టు అధికారులు గుర్తించడం జరిగింది.
మెహదీపట్నం,
యూసుఫ్ గూడ,
అంబర్ పేట,
చాంద్రాయణగుట్ట,
చార్మినార్,
కుత్బుల్లాపూర్,
కార్వాన్,
రాజేంద్రనగర్
వైరస్ ని అరికట్టడంలో భాగంగా ఈ 8 హైరిస్క్ జోన్లలో ఒక్కో జోన్లో వీలైనన్ని కంటైన్మేంట్ జోన్లను ఏర్పాటు చేసే దిశగా జిహేచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
