May 12, 2025

Digital Mixture

Information Portal

2021 జూన్ 30 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్…. గూగుల్ కీలక నిర్ణయం.

1 min read

Google

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపెడుతోంది. ఇండియాలో పరిస్థితి రోజు  రోజుకూ చేయి దాటిపోతోందనే చెప్పొచ్చు. ఇన్ని రోజులు లాక్ డౌన్ ప్రభావంతో ఎవ్వరూ బయటకు రాలేని పరిస్థితి. అన్ లాక్ మొదలైన తరువాత జనాలు మెల్లగా బయటకు రావడం జరిగింది. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్ళటం, జనాలు వాళ్ళ పనులకు రోడ్లపైకి రావటంతో, కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి.

 ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు  చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి పాటిస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరిగిపోతుండటంతో, గూగుల్ తమ ఉద్యోగులను ఇంటినుండే పనులు చేయాలని సూచించింది. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే సంవత్సరం జూన్ 30 వరకు అని తెలిపింది. దీనికి సంబందించిన మెయిల్స్ సంబంధిత ఉద్యోగులకు పంపించామని, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులకు అందరికి వర్తిస్తుందని గూగుల్  సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు.

ఈ నిర్ణయంతో మిగతా  సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అమలు  చేసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *