IT Return గడువు తేదీని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం…
1 min read
IT Return గడువు తేదీని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం…
కరోనా ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. దీనితో ప్రజల జీవనోపాధిపై ఆ ప్రభావం పడింది. దీనికి తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఆర్థిక వెసులుబాటులను కల్పిస్తూ వస్తోంది. అన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు 6 నెలల వరకు లోన్లపై వడ్డీ చెల్లించే అవసరం లేకుండా వెసులుబాటును కల్పించింది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందితో నెలవారి వాయిదాలను కట్టలేని పరిస్థితుల్లో ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. అయితే దానికి తగ్గ వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి.
అలాగే ఇప్పుడు ఇది 2019-20 గాను ఆదాయపు పన్ను దాఖలు చేసే సమయం. కాబట్టి కేంద్రం 2019 -20 గాను పన్ను చెల్లింపు దారులకు వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి పన్ను చెల్లించాల్సిన చివరి తేదీ జులై 31 వ తేదిగా ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు పొడగించారు. కానీ ఇప్పుడున్న కరోనా విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఐటీ శాఖ పన్ను చెల్లింపుల చివరి తేదీని నవంబర్ 30 వరకు పొడిగించారు.
దీనితో పాటు 2019 -20 టీడీఎస్ ,టిసీస్ స్టేట్మెంట్లకు కూడా ఆగస్టు 15 వరకు గడువును పొడిగించారు.
