May 12, 2025

Digital Mixture

Information Portal

ఆహా లో కొత్త వెబ్ సిరీస్లు, తక్కువ బడ్జెట్ సినిమాలు….

1 min read

ఆహా లో కొత్త వెబ్ సిరీస్లు, తక్కువ బడ్జెట్ సినిమాలు….

ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఆన్లైన్ ప్లాట్ఫాం ల పైన ఆధార  పడాల్సిన అవసరం వచ్చింది. లాక్ డౌన్ కారణంగా అందరు ఇంట్లోనే ఉండటంతో వీటికి ఎక్కువ ప్ర్రదాన్యం సంతరించుకుంది. రోజు టివిలలో అవే సినిమాలు తిప్పి తిప్పి వస్తుండటంతో జనాలు కూడా బోర్ ఫీలవుతున్నారు. దానికి తోడూ థియేటర్లకు అనుమతులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. అందుకోసం విడుదలకు రెడీగా ఉన్న సినిమాలను థియేటర్లు తెరుచుకునేవరకు  ఉంచడం నిర్మాతలకు భారంగా మారింది. దాంతో నిర్మాతలు OTT వైపు వెళ్తున్నారు.

దానితో ఇప్పుడు OTT లో కూడా  పోటీ పెరిగింది. ఆన్నిరకాల కంటెంట్ తో పాటు లేటెస్ట్ సినిమాలు ఉంటేనే సబ్స్క్రైబర్లు ఎక్కువవుతారు. ఇప్పుడు OTT లలో వెబ్ సిరిస్ లదే హవా అని చెప్పొచ్చు.  టాలీవుడ్ నుండి వచ్చిన OTT యాప్ ఆహా (aha). అల్లు అరవింద్ దీన్ని ప్రారంభించారు.  ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే చాలా మంది సబ్స్క్రైబర్లను పొందారు. కానీ ఆహా లో అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరిస్ లు ఎక్కువ అని టాక్ వచ్చింది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లో ఉన్నప్పటికీ, తెలుగులో ఫ్యామిలి ఆడియన్స్ కూడా చూడటంతో కొంత ఇబ్బంది కరంగా మారిందని టాక్. దీనితో ఆహా అండ్ కో, అలాంటి కంటెంట్ ని తగ్గించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టిన సబ్స్క్రైబర్లు తగ్గే అవకాశం ఉంది. దీనికోసం ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే కంటెంట్ ఉండేటట్టు ప్లాన్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.

అలాగే చిన్న సినిమాలను  ప్రోత్సహించేలా, తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలను ఆహా లో  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *