నితిన్ పెళ్లి హంగామా షురూ… పెళ్లి షెడ్యూల్ కన్ఫర్మ్…
1 min read
నితిన్ పెళ్లి హంగామా షురూ… పెళ్లి షెడ్యుల్ కన్ఫర్మ్…
మన సెలెబ్రిటీలు ఎంతో హంగు ఆర్భాటాలతో పెళ్ళి జరుపుకోవాలనే ఆశకు కరోనా బ్రేక్ వేసిందనే చెప్పొచ్చు. నిఖిల్, రానా, నితిన్ వీళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు చాలా భారీ ఎత్తున చేయాలనుకున్నారు. కానీ అది కరోనా వల్ల సాదా సీదాగా చేసుకోవాల్సి వస్తోంది.
నిఖిల్ తన పెళ్ళిని చాలా సింపుల్ గా, అతి ముఖ్యమైన వారి మధ్య చేసుకున్నాడు. అదే బాటలో నితిన్ కుడా తన వెడ్డింగ్ షెడ్యూల్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ నెల 26 వ తేదీన పెళ్ళి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. అయితే దానికి ముందు జరిగే హంగామాని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
22 న ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నాడు. 23 న మెహెందీ ఫంక్షన్, 24 న ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తామని, 26 రాత్రి 8:30 గంటలకు వివాహం జరుగుతుందనీ అదీ లెక్క అంటూ నితిన్ ఇన్స్టాగ్రాం ద్వారా అప్డేట్ చేసాడు. కానీ పెళ్లి ఎక్కడ జరుగుంతుందో చెప్పలేదు. ఫలక్ నుమా ప్యాలెస్ లో పెళ్లి జరగబోతోందని ప్రచారం జరుగుతున్నా దానిపై నితిన్ స్పష్టత ఇవ్వలేదు.
గత కొన్ని రోజులుగా నితిన్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన షాలిని తో ప్రేమలో ఉన్నాడు. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒకటవబోతున్నారు. కరోనా ప్రభావం తగ్గాక సినీ ఇండస్ట్రి కి సంబంధించిన సెలెబ్రిటీలకు పార్టీ ఇవ్వనున్నాడట.
మన హీరోలు, పెళ్ళిని వాళ్ళ సినిమాల లాగా హై బడ్జెట్ తో గ్రాండ్ గా చేసుకుందామంటే కరోనా దెబ్బకు లో బడ్జెట్ సినిమా లాగా సరిపెట్టుకోవాల్సి వస్తోంది పాపం.
