మెగాస్టార్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన మరో దర్శకుడు.
1 min read
మెగాస్టార్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన మరో దర్శకుడు.
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాకి దగ్గరైన సంగతి తెలిసిందే. ఖైదీ నెం 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు, సైరా అనే హిస్టారికల్ సినిమా తీసి తనకు సినిమాపై ఉన్న ఆసక్తిని మరోసారి సినీలోకానికి చూపించారు. అప్పటినుండి చిరంజీవి తన సినిమాల స్పీడును పెంచే పనిలో పడ్డారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు షూటింగులకు అనుమతి ఇచ్చినప్పటికీ చిరంజీవి షూటింగ్ మొదలు పట్టడానికి సుముఖంగా లేకపోవడంతో షూటింగ్ మరికోన్నిరోజులు వాయిదా పడింది ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.
అయితే కరోనా వల్ల షూటింగ్లు ఆగిపోవడంతో, భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు మెగాస్టార్. కొన్ని కథలు వినడం, మార్పులు చేర్పులు చేయడం చేస్తున్నారు. ఆచార్య సినిమా తరువాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అందులో ఒకటి సుజిత్ దర్శకత్వంలో మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు, చిరు అభిమానులకు తగినవిధంగా కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం. మొత్తానికి దర్శకుడు సుజిత్ పూర్తిగా స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడని సమాచారం.
ప్రస్తుతం ఈ లిస్టులో వెంకీ మామ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన బాబీ, మెగాస్టార్ కి చాలా రోజుల క్రితమే ఒక కథ వినిపించాడట. ఆ స్టోరీ లైన్ నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమన్నారట చిరు. ఇప్పుడు బాబీ కూడా చిరు కోసం పూర్తి స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా ఎవరికీ తెలియదు. దర్శకుడు కొరటాల శివ కూడా నిర్మాతల కోసం కొత్త కథలు విని ఫైనల్ చేసే పనిని మొదలు పెట్టారు. అలాగే OTT ల కోసం వెబ్ సిరీస్లు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఆచార్య సినిమా పూర్తయ్యాక, సుజిత్ లూసిఫర్ సినిమా తరువాత, బాబీ టర్న్ వస్తుంది. అంటే ఎంత కాదన్న చిరు-బాబీ కాంబినేషన్ లో సినిమా 2022 లో మొదలయ్యే అవకాశం ఉంది.
మెగాస్టార్ ఈ లాక్ డౌన్ సమయంలో ఇంకా ఏయే దర్శకుల కథలు ఒకే చేస్తారో మరి.
