3 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించబోతున్న సోనుసూద్…
1 min read
Images Source: Twitter / Sonu Sood
తన పుట్టినరోజు సందర్భంగా సోనుసూద్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటన
ఇండియాలోని టాప్ కంపెనీలతో ఒప్పందం
ఇండియాలో కరోనా వల్ల ప్రజా జీవితం తారు మారు అయ్యిందనే చెప్పొచ్చు. దీనివల్ల వలస కార్మికుల దగ్గరినుండి ఏసీ రూముల్లో కూర్చొని పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వరకు దీని ప్రభావం పడింది. వలస కార్మికులకు పనులు దొరకని పరిస్థితి, అలాగే అన్ని MNC కంపెనీలలో నష్టాలను అరికట్టే విధానంలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. దీనివల్ల, జీవనోపాధి కోల్పోవటంతో, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ విపత్కర సమయంలో వలస కార్మికులను ఆడుకోవడానికి ముందుకొచ్చాడు, నటుడు సోనుసూద్. వలస కార్మికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి, వారి గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది. తన హాస్పటల్స్ లో నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వడం జరిగింది.
కొద్ది రోజుల క్రితం ఆంద్రప్రదేశ్ లో ఒక పేద రైతు తన ఆడపిల్లలను కాడెద్దులుగా మార్చి దుక్కుతున్న ఫోటోలను చూసి చలించిపోయిన సోనుసూద్ రూ.8 లక్షల విలువగల ట్రాక్టర్ ని కొనివ్వడం జరిగింది. అలాగే హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే శారద , తన జాబ్ కోవిడ్-19 వలన కోల్పోవడంతో, తన కుటుంబాన్ని పోషించడానికి కూరగాయలు అమ్ముతోంది. ఈ విషయం తెలుసుకున్న సోనుసూద్ వెంటనే ఆమెకు జాబ్ కన్ఫర్మ్ చేస్తూ ఆఫర్ లెటర్ ని పంపించాడు.

నిన్న సోనుసూద్ పుట్టినరోజు సందర్భంగా అతను ప్రవాసి రోజ్గార్ వెబ్‌సైట్ (www.pravasirojgar.com) ద్వారా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దీని ద్వారా 3 లక్షల మందికి మంచి వేతనంతో ఉద్యోగం ఇప్పించే భాద్యతను తీసుకున్నాడు. దీనికోసం ఇండియాలోని కొన్ని టాప్ కంపెనీల సహాయం తీసుకుంటున్నట్టు తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ఈ విషయమై ముందుకొచ్చిన APEC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co, Portea కంపెనీలకు సోనుసూద్ ధన్యవాదాలు తెలిపాడు.
