May 12, 2025

Digital Mixture

Information Portal

ఈ సంవత్సరం ఉప్పెన వచ్చేనా….?

1 min read

ఈ సంవత్సరం “ఉప్పెన” వచ్చేనా….?

ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామనుకున్న మరో మెగా మేనల్లుడు, సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఆశలు నెరవేరేలా లేవు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వలనుకున్న వైష్ణవ్ తెజ్ కి కరోనా మహమ్మారి అడ్డుకట్టగా నిలిచిందని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఏప్రియల్ లో విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.

దీనికి తోడు, కరోనా విజ్రుంభన ఎక్కువైపోవడంతో ఇప్పట్లో సినిమా హాళ్ళు తెరిచే పరిస్థితి కనబడట్లేదు. దీంతో మధ్యలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదల చేయనున్నారని ప్రచారం జరిగింది.

అయితే వీటన్నింటినీ కాదని ఇప్పుడు నిర్మాతలు మైత్రీ మూవి మేకర్స్, సుకుమార్, ఈ సినిమాని 2021 సంక్రాంతికి    విడుదల చేయడానికి  సన్నహాలు చేస్తున్నారని సమాచారం. మెగా హీరో మొదటి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబటులో ఉండేలా సినిమా హాళ్ళలొనే విడుదల చేయాలనుకుంటున్నారట. ఓటీటీ అయితే ప్రజలందరికీ సినిమా చేరడం కష్టమని భావిస్తున్నారట.

దీన్ని బట్టి చూస్తే ఎంత లేటైనా సరే  సినిమా హాళ్ళలోనే విడుదల చేయాడానికే నిర్మాతలు సుముఖంగా ఉన్నారని సమాచారం.  నిర్మాతలకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్  అయి వసూళ్ళను  రాబడుతుందనే నమ్మకం ఉందనిపిస్తోంది.

మరి 2021 సంక్రాంతి వరకైనా ఈ కరోనా మహమ్మారి జోరు తగ్గి, యదాతథంగా సినిమా హాళ్ళు తెరుచుకోని, జనాలు ఎప్పటిలాగే సినిమా హాళ్ళకు వస్తారేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *