రానా చేతులమీదుగా ఆకాశవాణి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్…
1 min read
Image Source: Twitter / Rana Daggubati
రానా దగ్గుబాటి చేతులమీదుగా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆకాశవాణి ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఏయు అండ్ ఐ స్టూడియో బ్యానర్ పై పద్మనాభరెడ్డి నిర్మాతగా వస్తున్న చిత్రం ఆకాశవాణి. ఈ చిత్ర టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా ఉంది.
ఈ ఫస్ట్ లుక్ లో ఒక పెద్ద మర్రి చెట్టు కింద మేకల మంద, ఆ చెట్టుకు మేకల కాపరి వేలాడుతూ ఉంటాడు. దాని పక్కనే ఒక రేడియో కూడా వేలాడుతూ ఉంటుంది. మేకలు కాచుకోవడానికి వచ్చిన కాపరి చెట్టుకు వేలాడటం, ఆ పక్కనే రేడియో వేలాడటం చూసాక సగటు ప్రేక్షకుడు ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ తో దర్శకుడు ప్రేక్షకుడిని తన సినిమా గురించి మాట్లాడుకునేల చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.
అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సింది బాక్ గ్రౌండ్ మ్యూజిక్, కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ లుక్ కి తగ్గట్టే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆకాశవాణి మోషన్ పోస్టర్
