May 12, 2025

Digital Mixture

Information Portal

మైత్రీ మూవీస్ తో రామ్ చరణ్ కొత్త సినిమా…?

1 min read

Image Source: Twitter / Ram Charan

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా  చేస్తున్నాడు. ఈ సినిమాలో జూ.ఎన్‌టీఆర్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఆగిపోవడంతో మెగా పవర్ స్టార్ కొంచెం సేద తీరుతున్నాడు.

తన తరువాత సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో ఒకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మెగా ఫాన్స్ కి నచ్చే విధంగా స్టోరీ  లైన్ ఉండటంతో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

అయితే అందరు హీరోలు తమ కొత్త సినిమాని ప్రకటిస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప సినిమా షూటింగ్ మొదలవ్వకముందే కొరటాల శివతో తన 21 వ సినిమాని ప్రకటించాడు. తారక్ త్రివిక్రమ్ తో కమిట్ అయ్యాడు. చిరంజీవి కూడా ఆచార్య సినిమా తరువాత లూసిఫర్ సినిమాని రీమేక్ చేయబోతున్నరనే వార్తలు వస్తున్నాయి.  దాంతో పాటు డైరెక్టర్ బాబీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చటంతో పూర్తి స్క్రిప్ట్ తయారు చేయమన్నాడట. బాబీ స్క్రిప్ట్ కూడా రెడీ చేసాడని టాక్.

కానీ రామ్ చరణ్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కొత్త సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి.  రంగస్థలం సినిమా చేసే సమయంలో, మైత్రీ మూవీస్ కి రామ్ చరణ్ మరొక సినిమా చేస్తానంటూ హామీ ఇచ్చాడట. దానితో పాటు కొంత అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగిందట. దాన్ని బట్టి రామ్ చరణ్ మైత్రీ మూవీ తో తన కొత్త సినిమా చేయనున్నాడని, కార్తీక్ నటించిన ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది.

ఈ వార్త నిజమా కాదా అనేది తెలియాలంటే, రామ్ చరణ్ కానీ,మైత్రీ మూవీస్ కానీ అధికారిక ప్రకటన చేసేవరకు వేచి చూడాల్సిందే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *