May 12, 2025

Digital Mixture

Information Portal

సురేష్ రైనా తిరిగి ఐపిల్ లోకి రావడంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ షాకింగ్ కామెంట్స్….

1 min read

Image Source: Google

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగానే ఐపిల్ టి20 సమరం ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్ చెన్నై, ముంబై మద్య జరిగిన పోరులో చెన్నై బోణి కొట్టింది. తరువాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. అలాగే నిన్న ఢిల్లితో జరిగిన మ్యాచ్ లో కూడా 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీనితో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో కలవరం మొదలైంది. సురేష్ రైనా అనుకోని రీతిలో ఇండియాకి తిరిగి రావడం, అంబటి రాయుడు గాయంతో టీంలో లేకపోవడం, దీనితో అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఎలా ఉండబోతోందని ఆందోళన చెందుతున్నారు.

దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సురేష్ రైనాని తిరిగి టీంలోకి తీసుకరవాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్ ద్వారా రైనా ప్లీజ్ రావాలంటూ అభ్యర్తిస్తున్నారు.

దీనికి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వంనాథన్ స్పందిస్తూ “ఎలాంటి పరిస్తితుల్లో కూడా  ప్రాంచైజీ రైనాని తిరిగి రావాలని అడగడం జరగదని, రైనా కోసం మేము వేచి చూడం, ఎందుకంటే తనంతట తానుగా ఐపిల్ నుండి వెళ్ళిపోయాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం” అని  ఆయన స్పష్టం చేసారు.

ప్రస్తుతం 3 మ్యాచులాడిన చెన్నై, 2 పాయింట్లతో పట్టికలో 5 వ స్థానంలో ఉంది.

చెన్నై తన తరువాత మ్యాచ్ అక్టోబర్ 2 వ తేదిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *