IPL 2020, CSK: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాకింగ్ న్యూస్… సురేష్ రైనా ఐపిఎల్ 2020 సీజన్లో లేనట్లేనా…
1 min read
Image Source: Google
కొద్ది రోజులక్రితమే CSK అభిమానులు రైనా తిరిగి జట్టులోకి రావాలని, ఫ్రాంచైజీ రైనా తో మాట్లాడాలని డిమాండ్ చేసారు. దీనికి CSK CEO స్పందించిన సంగతి తెలిసిందే. రైనా తో సంప్రదింపులు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఏకంగా CSK అధికారిక వెబ్సైట్ నుండి సురేష్ రైనా పేరును జట్టు జాబితా నుండి తీసేయడం జరిగింది. దీనితో సురేష్ రైనా ఈ ఐపిఎల్ 2020 సీజన్ లో ఆడే అవకాశాలు లేవని CSK ఫ్రాంచైజీ తేల్చేసింది. దీనితో సిఎస్కే అభిమానులు తీవ్ర నిరాశ చెందినట్టు తెలుస్తోంది. దీనికి కారణం CSK వరుస పరాజయాలు. ధోని, జడేజా తమ మార్కు ఆటను ప్రదర్శించలేక పోతున్నారు. దీనితో జట్టులో అల్ రౌండర్ సురేష్ రైనా ఉంటే CSK మళ్ళి గెలుపు బాట పట్టే అవకాశం ఉందని అభిమానులు భావించారు. కానీ వ్యక్తిగత కారణాలతో దుబాయ్ నుండి ఇండియాకి తిరిగి వచ్చిన రైనాను తిరిగి జట్టులోకి తీసుకురావడానికి CSK యాజమాన్యం అయిష్టంగా ఉంది. అందుకే తమ వెబ్సైట్ నుండి రైనా పేరును తొలగించడం జరింగిందని తెలుస్తోంది.
అలాగే వ్యక్తిగత కారణాలతో దుబాయ్ వెళ్ళని హర్బజన్ సింగ్ పేరును కూడా జాబితా నుండి తొలగించడం జరిగింది.
