May 12, 2025

Digital Mixture

Information Portal

“అల్లు”వారి స్టూడియో రాబోతోంది… కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన అల్లు ఫ్యామిలీ…

1 min read

Image Source: Twitter / @alluarjun

అల్లు రామలింగయ్య గారి 99 వ పుట్టిన రోజు సందర్భంగా “ALLU Studios” ప్రకటన

తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతిలో ఉన్నదని ఎప్పటినుండో నడుస్తున్న చర్చ. ఎందుకంటే మెగాస్టార్, అల్లు, దగ్గుబాటి, అక్కినేని, నందమూరి వీరి కుటుంబాల నుండి ఎక్కువ మంది హీరోలు సినిమా పరిశ్రమలో ఉన్నారు. కొందరు స్టార్ హీరోలుగా ఎదిగితే, మరికొందరు స్టార్డం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కుటుంబాలలో కొందరికి సొంత స్టూడియోలు కుడా ఉన్నాయి. అలాగే ఇందులో కొందరు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కుడా ఉన్నారు. దీంతో సినిమా థియేటర్స్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటున్నాయనే వాదన.

అయితే నిన్న అక్టోబర్ 1 పద్మశ్రీ డా. అల్లు రామ లింగయ్య గారి 99 వ పుట్టిన రోజు సందర్భంగా అల్లు ఫామిలీ తరుపూన సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అదే అల్లు రామ లింగయ్య గారి 99 వ పుట్టిన రోజు గుర్తుగా అల్లు వారి స్టూడియో కట్టడం పనులను ప్రారంభించడం జరిగింది. ఈ స్టూడియో పేరును “అల్లు స్టూడియోస్”  అని పెట్టడంజరిగింది.

Image Source: Twitter / @alluarjun

ఇప్పటి వరకు అల్లు కుటుంబం ఖాతాలో నిర్మాణ సంస్థలు, సినిమా పంపిణి సంస్థలు, ఓటిటి మాత్రమే  ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వీరి ఖాతాలో “అల్లు స్టూడియోస్” చేరింది. దీనితో అల్లు అరవింద్ తన వ్యాపార రంగాన్ని మరింతగా ముందుకు తెసుకెల్లబోతున్నాడు. మరి ఈ స్టూడియోని ఎంత అదునాతనంగా కట్టిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *