May 12, 2025

Digital Mixture

Information Portal

IPLT20-2020: డిల్లి చేతిలో రాజస్థాన్ చిత్తు… పాయింట్ల పట్టికలో నం.1 స్థానానికి ఎగబాకిన డిల్లి కాపిటల్స్ …

1 min read
IPL20, IPL20-2020, Cricket, Delhi Capitals, Rajasthan Royals, డిల్లి కాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, Hetmyer, Stoinis

Image Credits: Wikipedia

138 పరుగులకే కుప్పకూలిన రాజస్థాన్

చెలరేగిన Hetmyer, Stoinis, Rabada

విధ్వంసం సృష్టించిన Hetmyer

నిన్న షార్జా వేదికగా జరిగిన IPLT20 మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన డిల్లి కాపిటల్స్ ఓపెనర్స్ త్వరగా అవుట్ అవటం డిల్లి కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే పృథ్వీ షా (19 / 10 ) , శిఖర్ ధావన్ ( 5 /4 ) తక్కువ స్కోర్లకే అవుటవడం, శ్రియాస్ అయ్యర్ ( 22/ 18 ), రిషబ్  పంత్  ( 5/ 9 ) లు రన్ అవుట్ అవ్వటంతో ఈ సారి రాజస్థాన్ రాయల్స్ కి విజయావకాశాలు ఉన్నట్టు కన్పించింది. ఒక దశలో డిల్లి స్కోరు 4 వికెట్లు కోల్పోయి 79 రన్స్ తో  కష్టాల్లో కూరుకుపోయింది. దీనితో అభిమానులు డిల్లి కి ఓటమి తప్పదని ఉహించారు.

అప్పుడే ఆట కీలక  మలుపు తిరింగిదని చెప్పొచ్చు. Stoinis, Hetmyer క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఎవరు ఉహించ నంతగా స్కోరు బోర్డును పరిగెత్తించారు. సిక్సర్ల మోత మోగించారు. Stoinis  4 సిక్సర్లతో 30 బంతుల్లో 39 పరుగులు చేసాడు. Hetmyer కూడా నేనేమి  తక్కువ కాదు  అన్నట్టు 5 సిక్సర్లు, 1 ఫోర్ తో 24 బంతుల్లో 45 పరుగులు చేసాడు. దీనికి తోడు harshal patel, aksar patel తమ బ్యాట్ కి పని చెప్పటంతో డిల్లి కాపిటల్స్ గౌరవప్రదమైన, పోరాడేందుకు కావాల్సిన 184 పరుగులు చేయగలిగింది..

తరువాత 185 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ , 185 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేదిస్తుందని భావించారు అభిమానులు. ఎందుకంటే, షార్జా స్టేడియం చిన్నది కావడం, అలాగే ఇక్కడ రాజస్థాన్ ఇదివరకే రెండు మ్యాచులు గెలవడం. కానీ డిల్లి బౌలర్ల సమిష్టి కృషితో రాజస్థాన్ 138 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. అశ్విన్ (2 / 22 ),  Stoinis ( 2/ 17 ), rabada ( 3/ 35 ), Nortje (1 / 25), అక్షర్ పటేల్  (1/ 18) వికెట్లు తీసి రాజస్థాన్ పై 46  పరుగుల తేడా తో విజయం సాధించారు.

అప్పటి వరకు దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 24 పరుగులకు అవుట్ అవ్వడం , రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాట్స్ మెన్ సంజు సామ్సన్ 5 పరుగులు చేసి భారీ సిక్సర్ కి ప్రయత్నించి Hetmyer చేతిలో అవుటవ్వడంతో  రాజస్థాన్ 185 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో వెనుకబడిందని చెప్పొచ్చు. తరువాత వరుసగా వికెట్లు పడటంతో రాజస్థాన్ రాయల్స్ కి ఓటమి తప్పలేదు.

ఈ విజయంతో 6 మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచి, మెరుగైన రన్ రేట్ తో డిల్లి IPLT20 పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచులో ఓడిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 7 వ స్థానానికి చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *