May 12, 2025

Digital Mixture

Information Portal

RRR Teaser: కొమురం భీమ్ వచ్చేసిండు, గర్జించిన జూ.ఎన్టీఆర్…

1 min read
RRR Teaser, Komuram Bheem, S.S. Rajamouli, Rajamouli RRR, Jr. NTR, Ram Charan, ఆర్ ఆర్ ఆర్ (RRR), కొమురం భీమ్ , తెలంగాణ ముద్దు బిడ్డ

కొమురం భీమ్ Image Source: Youtube

హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ముద్దు బిడ్డ, ఆదిలాబాద్ కి చెందిన గిరిజనోద్యమ నాయకుడు మన కొమురం భీమ్ . ఆయన జయంతి సందర్భంగా మన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన కొమురం భీమ్ (జూ.ఎన్టీఆర్ ) మన ముందుకు వచ్చాడు. బాహుబలి సీరిస్ తరువాత  ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ (RRR). ఈ సినిమాలో కొమురం భీమ్ గా నటిస్తున్నాడు మన జూ.ఎన్టీఆర్.

ఎప్పటినుండో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న జక్కన్న ఈ సందర్భంగా కొమురం భీమ్ టిజర్ ని విడుదల చేసారు. జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. విడుదల అయిన కొమరం భీం టిజర్ కి రామ్ చరణ్ వాయిస్ ఇవ్వడం జరిగింది. ఈ కొమరం భీమ్ గొప్పతనాన్ని వర్ణిస్తూ చెప్పే విధానం ఆకట్టుకుంది. అయితే ఇక్కడ మరో సారి ఎస్.ఎస్. రాజమౌళి విజువల్ వండర్ కనబడుతుంది. నీళ్ళు, సముద్రం, అలలు ఇలాంటి విజువల్స్ చూస్తే బాహుబలి గుర్తుకు వస్తుంది. అయితే అప్పుడే ఈ టీజర్ పై నెటిజన్స్  సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఈ టీజర్ లో వాడిన కొన్ని విజువల్స్ అక్కడివి, ఇక్కడివి అని వెతికి సోషల్ మీడియాలో కొందరు ప్రచారం మొదలు పెట్టారు.  

RRR Teaser, Komuram Bheem, S.S. Rajamouli, Rajamouli RRR, Jr. NTR, Ram Charan, ఆర్ ఆర్ ఆర్ (RRR), కొమురం భీమ్ , తెలంగాణ ముద్దు బిడ్డ
Komuram Bheem Image Source: Youtube

కానీ మనం ఇంతవరకు చూడని జూ.ఎన్టీఆర్ ని చూసినట్టు అనిపిస్తోంది. ఈ కొమురం భీమ్ టీజర్ మాత్రం ఫ్యాన్స్ కి తెగ నచ్చేలా ఉంది. ఫ్యాన్స్ కోరుకునే విధంగా జక్కన్న టీజర్ ని తయారు చేసాడు.

ఈ డైలాగులు విని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్

నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయ్

వాడి పొగరు ఎగిరే జెండా

వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ

వాడు భుతల్లి చనుపాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ

ఈ డైలాగులకు తగ్గట్టు యం.యం. కీరవాణి బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేట్టు ఇచ్చారు అని చెప్పొచ్చు.

మీరు కుడా ఈ టీజర్ ని చూసేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *