May 12, 2025

Digital Mixture

Information Portal

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ కొత్త చిత్రం టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ విడుదల…

1 min read
Nithin Latest Movie, Telugu Movie  News, Telugu Cinema, Koratala Shiva, నితిన్ కొత్త చిత్రం

Image Source: Twitter / @actor_nithin

నితిన్ భీష్మ సినిమా తో మళ్ళి ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి. వెంటనే కొత్త సినిమాలకు గ్రీన్  సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు..  చంద్రశేఖర్ యేలేటి  దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  

ఈ సినిమాకి సంబందించిన టైటిల్ మరియు ప్రీ లుక్ పోస్టర్ ని దర్శకుడు కొరటాల శివ విడుదల చేసారు. ఈ సినిమాకి చెక్ అనే  టైటిల్ ని ఖరారు చేసారు. అయితే  ప్రీ లుక్ పోస్టర్ ని చుస్తే ఈ సినిమా  చెస్ ఆటకి సంభందించిందని అర్ధమవుతోంది. అలాగే సంకెళ్ళు వేసుకుని  ఉన్న నితిన్, అలాగే కంచెను కూడా చూడొచ్చు. అయితే ఈ ఆటలో ఎవరు ఎవరికీ ఎలా చెక్ పెట్టారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

దర్శకుడు చంద్రదేఖర్ యేలేటి మాట్లాడుతూ, చదరంగం (చెస్)  నేపధ్యంలో సాగే ఒక ఉరి శిక్ష పడ్డ ఖైదీ కథ ఇది అని అన్నారు. రాకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్  వారియర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భవ్య  క్రియేషన్స్ పై వీ.  ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ, ఈ సినిమాలో చివరి వరకూ ఎవరు ఎవరికీ చెక్ పెడతారో తెలియదు.  నితిన్ ఇప్పటివరకు చేయని పాత్ర ఇది. ఈ నెల 12 నుండి నెల చివరి వరకు చేసే  షెడ్యుల్ తో, దాదాపుగా షూటింగ్ పూర్తవుతుంది. మిగతా విషయాలు త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పారు.

ప్రస్తుతం నితిన్ నటిస్తున్న రంగ్‌దే సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో హిరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *