May 12, 2025

Digital Mixture

Information Portal

GHMC ఎన్నికల నోటిఫికేషన్ విడుదల… GHMC elections notification 2020

1 min read
GHMC, GHMC Elections, GHMC Elections Notification 2020, జీహెచ్ఎంసీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, హైదరాబాద్

Ghmc Election Notification 2020

జీహెచ్ఎంసీకి మోగిన ఎన్నికల గంట… డిసెంబర్ 1 న పోలింగ్, 4 న కౌంటింగ్ , 20 న నామినేషన్ల చివరి తేదీ, 22 న విత్ డ్రాయల్,  మేయర్ గా జనరల్ మహిళకు రిజర్వేషన్. .. బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్….  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది . మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారధి షెడ్యూల్ విడుదల చేశారు.

నోటిఫికేషన్ తో పాటే షెడ్యూల్ ను కూడా ప్రకటించారు . బ్యాలెట్ పద్దతిలో కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలను నిర్వహిస్తారు. గ్రేటర్ పరిధిలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా .. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఈ నెల 20 వ తేది వరకు నామినేషన్లు స్వికరించనున్నారు. 21 వ నామినేషన్ల పరిశీలన , అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 24 న ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు . డిసెంబర్ 1 న పోలింగ్ జరుగనుండగా.. అవసరమైతే డిసెంబర్ 31 న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు . ఉదయం ఏడు గంటల నుంచి , సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు.

4 వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి , ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్ విడుదలతో తక్షణమే  ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో వార్డుల విభజన లేదని, 2016 లో మాదిరిగానే 150 వార్డులకు, అవే రిజర్వేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని పార్థసారథి తెలిపారు . జీహెచ్ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని, 2016 జీహెచ్ఎంస్ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్ ఇప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు . రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులని వివరించారు. బల్దియా పరిధిలో ఉన్న ఓటర్లలో 12.09 శాతం పరుషులు, 47.90 శాతం మహిళలు ఉన్నారని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *