May 12, 2025

Digital Mixture

Information Portal

Big Boss Telugu: ముక్కు అవినాష్ ఇక జబర్దస్త్ లోకి రానట్టేనా? Mukku Avinash Permanently Out From Jabardasth

1 min read
Mukku Avinash, Jabardasth, బిగ్ బాస్ 4 తెలుగు, Big Boss Telugu

Image Source: Google

ఈటీవి లో మల్లెమాల సంస్థ ఆల్ టైం జోష్ తో కొన్ని  సంవత్సరాలుగా కామెడీని అందిస్తున్న షో Jabardasth. ఈ కామెడీ షో ద్వారా చాలా మంది కమేడియన్స్ తెలుగు  సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షోలో చేసినందుకుగాను వారు డబ్బుతో పాటు చాలా స్టార్ స్టేటస్ ని కూడా సంపాదించుకున్నారు. ఒకరకంగా జబర్ధస్త్, మల్లెమాల టీం కామెడీ ఆర్టిస్టులకు ఒక జీవితాన్నే ఇచ్చిందని చెప్పొచ్చు. కొందరు జబర్ధస్త్ షో వొదిలేసి ఫుల్ టైం సినిమాలలో స్థిరపడి పోయారు. అలాగే కొందరు బయటికి వెళ్లి తిరిగి జబర్ధస్త్ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, Mukku Avinash, జబర్ధస్త్ వదిలేసి అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 4 తెలుగు  సీజన్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది ఒక పెద్ద వార్త అయిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ 4 లో ముక్కు అవినాష్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్తైన్మెంట్ చేస్తున్నాడు.  Mukku Avinash పక్కా ప్లానింగ్ తో గేమ్ ఆడుతూ ప్రేక్షకులనుండి అధిక ఓట్లు సంపాదిచుకుంటున్నాడు.

మల్లెమాల వారి నిబంధనలకు వ్యతిరేకంగా అవినాష్ బిగ్ బాస్ 4 లోకి వెళ్ళడంతో , దానికి అవినాష్ పెద్దమొత్తంలో ఫైన్ చెల్లించాడని సమాచారం.  అయితే అవినాష్ అభిమానులు మాత్రం బిగ్ బాస్ 4 తెలుగు అయిపోయిన తరువాత తిరిగి జబర్ధస్త్ లోకి వస్తాడనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ముక్కు అవినాష్ జబర్ధస్త్ లోకి రీఎంట్రీ కష్టమే అని తెలుస్తోంది.

బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే జబర్ధస్త్ కి టాటా బై బై చెప్పాల్సి ఉంటుందని మల్లెమాల వారు కండిషన్ పెట్టడంతో, అవినాష్ జబర్ధస్త్ కి బై బై చెప్పాడని తెలుస్తోంది. అయితే అప్పటివరకు మాస్ అవినాష్,కెవ్వు కార్తీక్ గా ఉన్న వారి టీం పేరు కెవ్వు కార్తీక్ గా మారి పోయింది. దీనితో అవినాష్ జబర్ధస్త్ నుండి వెళ్లిపోయాడని కన్ఫర్మ్ అయింది.

అయితే మరి బిగ్ బాస్ వచ్చే నెలతో పూర్తవుతుంది. దాని తరువాత అవినాష్ ఎక్కడికి వెళుతాడు, ఏ షోలో చేస్తాడు అనేది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అవినాష్ కోసం వేరే ఛానల్ వారు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. వారు అవినాష్ కి స్వాగతం పలకడానికి రెడీ గా ఉన్నారట. జీ తెలుగు లో ప్రసారమవుతున్న అదిరింది  బొమ్మ కామెడీ  షోలో  కామెడీ పండించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షోలో జబర్ధస్త్ కమెడియన్స్ వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *