May 12, 2025

Digital Mixture

Information Portal

టాలీవుడ్ లో మరో లేడీ డైరెక్టర్… అగ్ర హీరోల చూపు ఆమె వైపే…

1 min read
Sudha Kongara, Aakasham nee hadduraa, Surya, Amazon Prime, OTT,  సుధ కొంగర, ఆకాశం నీ హద్దురా

Sudha Kongara. Image Source: Google

సినిమా ఇండస్ట్రీ లో లేడి డైరెక్టర్లు అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు. వేళ్ళ మీద లెక్కపెట్టే అంత మంది ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. అయితే ఈమద్య ఒక పేరు బాగా వినబడుతోంది, ఆమెనే సుధ కొంగర. ఈమె ప్రముఖ దర్శకుడు మణిరత్నం దగ్గర దాదాపు 7 సంవత్సరాలు దర్శక విభాగంలో పనిచేసారు. అలాగే స్వతహాగా ఈమె రచయిత కూడా. రచయిత కావడం వల్ల తనకు దర్శకురాలిగా ఎదగడానికి దోహదపడిందని చెప్పొచ్చు.

మణిరత్నంతో పని చేసినప్పటినుండి తెలుగు, తమిళ హీరోలతో పరిచయాలు ఏర్పడ్డాయి.  దీనితో మాధవన్ తో  “సాల ఖడూస్” సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని  అందుకుంది. ఇదే సినిమాని తమిళంలో “ఇరుది సుత్రు” గా రూపొందించడం జరిగింది. తమిళంలో కూడా భారీ హిట్ ని సొంతం చేసుకుంది. దీనితో ఈ సినిమాపై విక్టరీ వెంకటేష్ మనసు పడి,  తెలుగులో “గురు” పేరుతో తీయడం జరిగింది. తెలుగులో కూడా మంచి సక్సెస్ ని అందుకుంది.

దీనితో సుధ కొంగర సినిమాలంటే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తమిళంలో మంచి పరిచయాలు ఉండటంతో సూర్య తో సినిమా చేయడానికి సులువైంది. సూర్యతో చేసిన సినిమా “సురరై పోత్రు”,  తెలుగులో  “ఆకాశం నీ హద్దురా” దీపావళి పండుగ సందర్భంగా OTT ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో విడుదలైంది. ఈ సినిమా కెప్టైన్ గోపీనాథ్ కథ ఆధారంగా ఈ సినిమాని తీసారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల చేసారు.

“ఆకాశం నీ హద్దురా” సినిమా అందరి ప్రశంశలు అందుకుంటూ భారీ హిట్ ని సొంతం చేసుకుంది. సూర్య నటనకు అందరు ఫిదా అయిపోతున్నారు. ఎమోషనల్ సీన్లలో సూర్య నటన అత్భుతం అని చెప్పొచ్చు.  థియేటర్లో విడుదల కాకుండా OTT ఫ్లాట్ ఫాం లో విడుదల అయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా గా  “ఆకాశం నీ హద్దురా”  రికార్డులు సొంతం చేసుకుంటోంది.  ఈ సినిమా చూసి మాధవన్, విక్టరీ వెంకటేష్ లు ప్రశంసలు కురిపించారు.

అయితే ఈ విజయంతో సుధ కొంగర తన తరువాత సినిమాని సూర్య తమ్ముడు కార్తి తో ప్రకటించడం జరిగింది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే తనతో స్టార్ హీరోలు కూడా సినిమా చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *