CRICKET NEWS: ఇప్పుడంతా మాట్లాడుకునేది దీని గురించే.. Concussion Substitute
1 min read
Concussion Substitute Source of Images: Twitter / @BCCI
ఇప్పుడు ఎక్కడ చూసినా నిన్న కాన్ బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మద్య జరిగిన T20 మ్యాచ్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ T20 మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా పై విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా ఆస్ట్రేలియా ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనికి బదులుగా ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ త్వరగా వికెట్లు కోల్పోవడంతో ఆట ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్ళినట్లు అనిపించింది. కానీ కె ఎల్ రాహుల్ సముయోచిత బ్యాటింగ్ తో అర్ధ శతకాన్ని చేయడం తో పాటు, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మెరుపు బ్యాటింగ్ చేయడం తో, చివరి మూడు ఓవర్లలో భారత్ 46 పరుగులు రాబట్టి 161 పరుగులు చేసింది.
అయితే ఈ క్రమంలో రవీంద్ర జడేజా కి తొడ కండరాలు పడి ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది తో కూడా భారీ షాట్లు ఆడడం జరిగింది. దానితో పాటు భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లో స్టార్క్ వేసిన బంతి బౌన్సర్ రూపంలో జడేజా హెల్మెట్ కి తాకింది. అప్పటి వరకూ బాగానే ఉంది. కానీ భారత్ ఫీల్డింగ్ కి వచ్చేటప్పుడు జడేజా స్థానంలో తుది జట్టులో లేని చాహల్ ఫీల్డింగ్ కి వచ్చాడు. ఇక్కడ చాహల్, రవీంద్ర జడేజా స్థానంలో సబ్‌స్టిట్యూట్ లా కాకుండా కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా వచ్చాడు.
అసలు కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏమిటి? సబ్‌స్టిట్యూట్ , కంకషన్ సబ్‌స్టిట్యూట్ మద్య తేడా ఇదే…
అసలు కంకషన్ (concussion) అంటే బలమైన గాయం / దెబ్బతో స్పృహ తప్పడం అని అర్ధం.
సాధారణంగా మనం ప్రతీ మ్యాచ్ లో చూస్తూ ఉంటాం, ఈ ప్లేయర్ కైనా గాయానికి గురైనప్పుడు అతని స్థానంలో మరొక ఆటగాడు ఫీల్డ్ లోకి వస్తాడు. ఈ ఆటగాడు ఫీల్డింగ్ మాత్రమే చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే కంకషన్ సబ్‌స్టిట్యూట్ విషయంలో మాత్రం , ఏ ఆటగాడైనా బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ సమయంలో గాయం పాలైతే ఆ ఆటగాడి స్థానం లో పూర్తి స్థాయి ఆటగాడిగా మైదానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఫీల్డింగ్ తో పాటు బౌలింగ్ కానీ, బ్యాటింగ్ గానీ చెయ్యొచ్చు. కానీ ఈ ఆటగాడు ఏదైనా ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడటం జరుగుతుంది.
అయతే ఇదే విషయమై ఆస్ట్రేలియా కోచ్, కెప్టైన్ మ్యాచ్ రెఫరీ తో వాగ్వివాదానికి దిగినట్టు నిన్నటి ప్రసారంలో స్పష్టంగా తెలుస్తోంది. జడేజా స్థానంలో పూర్తి స్థాయి ఆటగాడిగా చాహల్ ని కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా తీసుకోవడంపై ఆస్ట్రేలియా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినప్పటికీ చాహల్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా ఆడటం జరిగింది. ఈ మ్యాచ్ లో చాహల్ 3 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ అనే విధానం ఐసిసి గత ఏడాది అమలులోకి తెచ్చింది. దీన్ని మొదటి సారిగా వినియోగించుకున్నది మాత్రం ఆస్ట్రేలియానే . యాషెస్ సీరిస్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మద్య జరిగిన రెండవ టెస్టులో మొదటి ఇన్నిగ్స్ లో స్టీవ్ స్మిత్ మెడకు బలంగా బంతి తగలంతో కంకషన్ (concussion) కు గురికావడం జరిగింది. తాను రెండో ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో అతని స్థానంలో బ్యాటింగ్ కి లబుషేన్ కంకషన్ సబ్‌స్టిట్యూట్ (concussion substitute)వచ్చి ఆస్ట్రేలియాని ఓటమి నుండి తప్పించాడు.
ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్ మద్య జరిగిన టెస్టు మ్యాచ్ లో కూడా బంగ్లాదేశ్ ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ (concussion substitute) విధానాన్ని ఉపయోగించుకుంది.
ఇప్పుడు భారత్ నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి T20 మ్యాచ్ లో కంకషన్ సబ్‌స్టిట్యూట్ (concussion substitute) విధానాన్ని ఉపయోగించుకుంది. ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ (concussion substitute) భారత్ విజయానికి దోహద పడిందని చెప్పొచ్చు.
భారత్ ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ (concussion substitute) విధానంలో జడేజా బదులు చాహల్ ని తీసుకోవడంపై పలురకాల విమర్శలు వచ్చినా, భారత్ ఐసిసి నిబంధనల ప్రకారమే చాహల్ ని తీసుకున్నారని మరికొందరు మద్దతు పలుకుతున్నారు.
