India vs Australia 1st Test: తుది జట్టుని ప్రకటించిన విరాట్ కోహ్లి
1 min read
India Vs Australia 1st Test Image Source: Google
ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న భారత్ వన్డే సీరిస్ ని చేజార్చుకొని, T20 సీరిస్ ని కైవసం చేసుకుంది. ఇక రేపటి నుండి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మద్య నాలుగు టెస్టుల సీరిస్ ప్రారంభం కానుంది. ఈ మొదటి డే / నైట్ టెస్టుకు భారత్ తుది జట్టును ప్రకటించింది. ఈ తుది జట్టులో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మకి చోటు దక్కలేదు.
ఈ టెస్టులో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా,వృద్ధిమాన్ సాహా వికెట్ కీపర్ గా తుది జట్టులో చోటు సంపాదించారు. అలాగే ముగ్గురు పేసర్లు మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా,ఉమేశ్ యాదవ్ తో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో భారత్ తొలి టెస్టుకు సన్నద్ధమైంది. వీరితో పాటు హనుమ విహారిని పార్ట్ టైం బౌలర్ గా వినియోగించుకోనున్నారు.
ఆస్ట్రేలియా తో తొలి టెస్టుకు ఆడబోయే భారత జట్టు తుది జాబితా ..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్.
