వేదములే జ్యోతిష్యానికి ఆధారం
1 min read
జ్యోతిష్య శాస్త్రం
భారతీయ జ్యోతిషం వేదంలోని ఖగోళమైన, జ్యోతిష పరమైన “ఋక్ “ అనే మంత్రములలోని గణిత సూత్రముల ఆధారంగా జ్యోతిశ్శాస్త్రం ఏర్పడినది. కాలోహ్యం నిరవధి: అన్నాడు భవభూతి.
అంటే కలం అవధిలు లేనిదని అర్ధం. మనకు ఈ లోకంలో కనిపిస్తున్నవన్నీ ఏదో కొలమానంలో ఉన్నవే. దీంతో మానవుడు అవిచ్చిన్నమైన కాలాన్ని కూడా కొలిచే ప్రయత్నం చేశాడు. వాడియైన సూది, లేత తామరాకును పొడిచే “తృటి” అనే సూక్ష్మ స్థాయినుంచి లక్షా పంతొమ్మిది వేల కోట్ల సంవత్సరాలు బ్రహ్మ ఆయువు వరకు కాలాన్ని వివిధ కొలతలతో విభజించాడు. ఇప్పటికి ఇన్ని యేళ్ళు గడిచినాయి అని లెక్కలు రాసుకుంటున్నా, కాలమా గడిచిపోయేది… అన్న ప్రశ్న మనిషి మనస్సులో రాలేదు. ఈ ప్రశ్న వేసుకున్న వేదాంతి భర్తృహరి. కాలో నయాతో వయమేవ యాతా: అన్నాడు. అనగా కాలం కాదు గడిచి పోయేది, మనమే అని అర్ధం. బ్రహ్మ ఆయువు కూడా కాలానికి పరమావధి కాదు, కాలం అనంతం అని గ్రహించినా లౌకిక వ్యవహారాల కోసం కాల గణన అవసరమైనదని భావించి కాలాన్ని ఇప్పటికీ కోలుస్తూనే ఉన్నాం.
భారతీయులమైన మనం అరవై సంవత్సరాల చక్రంలో కాలాన్ని బిగించి లెక్కలు వేసుకుంటున్నాము.మరోలా చెప్పాలంటే మానవులుగా మనం చూసిన కాలావధి. లెక్కమాత్రమే. భగవంతుడు శాశ్వతం, వ్యక్తికాదు అని భారతీయ దర్శనాలన్నీ చెబుతున్నాయి. అశాశ్వతుడైన మానవుడు అనంతం కాలాన్ని లెక్కించే పరిజ్ఞానం పొందడం దైవలీల అని చెప్పొచ్చు.
కాల గణన శాస్త్రాన్ని అద్యయనం చేసిన వ్యక్తినే దైవజ్ఞుడు లేక జ్యోతిష్యుడు అని అంటారు.
పంచాంగం – పరమార్ధం.
పంచాంగం అంటే హైందవ సంస్కృతిలో నిత్య జీవన మార్గ దర్శిగా శుభా శుభాల సమస్థ సమాచారాన్ని తెలియజేసేది అని అర్ధము. ఇవి మూడు రకములుగా మనం చెప్పుకోవచ్చు.
సిద్ధాంత భాగము : గణితానికి సంభందిచినవి ఉండును, యుగ ప్రమాణము, మూఢమి, మున్నగునవి తెలుస్తాయి.
సంహితా భాగము: అనేక విషయాలు ఒక చోట సమకూర్చును.
హోరా భాగము: ఫలిత భాగము, మరో వేరు గ్రహస్థితి ద్వారా శుభ అశుభ ఫలితాలు తెలుస్తుంటాయి.
