తిరుప్పావై పాశుర ప్రాశస్త్యము – వివరణ
1 min read
తిరుప్పావై పాశుర ప్రాశస్త్యము – వివరణ
ధనుర్మాసంలో శ్రీ ఆండాళ్ (గోదాదేవి)అనుగ్రహించిన భక్తి రాగమాలికలు
తిరుప్పావై మొత్తం 30 పాశురాలతో కూడి ఉంటుంది.
మొదటి పాశురము “మార్గళిత్తింగళ్” నుండి 5 వ పాశురము “మాయనైమన్ను” వరకు అనగా మొదటి పాశురము నుండి 5 వ పాశురము వరకు గోదాదేవి ప్రకృతి పరిచయమును చక్కగా వివరించడం జరిగింది.
6 వ పాశురము “పుళ్లుమ్ శిలుంబినకాణ్” నుండి 15 వ పాశురము అయిన “ఎల్లే! ఇళంకిళియే” వరకు గోదాదేవి భక్తురాలులైన గోపికలను మేలుకొలపడం గురించి వివరిస్తుంది.
16 వ పాశురం “నాయగనాం” నుండి 20 వ పాశురము “ముప్పత్తుమూవర్” వరకు పాశురాలలో గోదాదేవి జరిగిన సంగటనలను తెలియజేసింది.
21 వ పాశురము “ఏత్తక్కలంగళ్” నుండి 30 వ పాశురము “వంగక్కడల్” పాశురము వరకు గోదాదేవి శరణాగతి తత్వాన్ని తెలియజేసింది.
అలాగే 18 వ పాశురము అయిన “ఉందుమద ళిత్త” శ్రీ రామానుజుల వారికి చాలా ఇష్టమైన పాశురము.
29 వ పాశురము “శిత్తుంశిరకాలే” వైష్ణవ దర్శన సారము.
ఆండాళ్ తిరువడి గళే శరణమ్, శ్రీ క్రుష్ణార్పణ మస్తు…
