యుకే నుంచి వచ్చిన వారికి కరోనా, Covid19 strain in Telangana?
1 min read
యుకె నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతు న్నాయి . కొత్తగా మరో ఇద్దరికి కరోనా పాజి టివ్ నిర్ధారణ అయింది . వీరిద్దరూ మేడ్చలు ల్కాజిగిరి జిల్లాకు చెందిన వారు . యుకె నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 18 కి చేరింది . వీరి ప్రైమరీ కాంటాక్ట్ లో ముగ్గురికి కరోనా సోకినట్టు తేలినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది . ఇప్పటి వరకు యుకె నుంచి వచ్చిన 18 మంది , వారి ప్రైమరీ కాంటాక్ట్ లో ముగ్గురికి మొత్తం 21 మందికి వైరస్ సోకింది . పాజిటివ్ వచ్చిన వారు హైద రాబాద్ లో నలుగురు , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆరుగురు , జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు , మంచిర్యాల , నల్లగొండ , రంగారెడ్డి , సంగారెడ్డి , సిద్దిపేట , వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ డైరక్టర్ డాక్టర్ జి . శ్రీనివాసరావు తెలిపారు .
ఈ మేరకు యుకె నుంచి వచ్చిన వారితో కరోనా హెల్త్ బులెటినను శనివారం విడుదల చేశారు . డిసెంబర్ 9 వ తేదీ నుంచి యుకె నుండి తెల గాణ రాష్ట్రానికి 1216 మంది వచ్చారు . వీరిలో 937 మందిని గుర్తించి వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు . మొత్తం ఇప్పటి వరకు మొత్తం 18 మందికి కరోనా వైరస్ సోకగా వారిని చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో పెట్టారు . అయితే వైరస్ సోకిన 18 మందితో 79 మందికి అతిసన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి , వెంటనే వారిని క్వారంటైన్లో పెట్టి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు . వీరిలో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది . కాగా ఇప్పటి వరకు యుకె నుంచి వచ్చి కరోనా వైరస్ సోకిన వారిలో ఏ వైరస్ ఉన్నదో తెలుసుకునేందుకు వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం సిసి ఎంబికి పంపించారు . దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి .
ఆ 184 మంది ట్రేస్ కు ప్రయత్నం :
యుకె నుండి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా ఆయా రాష్ట్ర ప్రభుత్వా లకు సమాచారం అందించారు . మరో 184 మందికి సంబందించిన వివ రాలు సమగ్రంగా లేవు . దీంతో వారి అడ్రన్లు , ఫోన్ నంబర్స్ సక్రమంగా లేకపోవడంతో వారిని ట్రేస్ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్ని స్తోంది . డిసెంబర్ 9 తరువాత తెలంగాణ రాష్ట్రానికి నేరుగా యుకె నుండి వచ్చిన వారు , లేదా యుకె ద్వారా ప్రయాణించిన వారు తమ వివరాలను 04024651119 నంబర్‌కు ఫోన్ , లేదా 9154170960 నంబరు వాట్సాప్ ద్వారా అందిచాలని వైద్య ఆరోగ్య శాఖ డైరక్టర్ జి.శ్రీనివాస్ రావు విజ్ఞప్తి చేశారు . సమాచారం తెలిస్తే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వారి ఇంటికే వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు . కరోనా వైరసన్ను ఎదుర్కొవడంలో తెలంగాణ రాష్ట్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని , ప్రభుత్వ చర్యలు , ప్రజల సహకారంతోనే వైరస్ వ్యాప్తి , మరణాల సంఖ్యను అదుపులో తీసుకొచ్చామని ఆయన తెలిపారు . మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు . కొత్త రకం వైరస్ తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు . మాస్క్ తప్పని సరిగా వాడాలని , భౌతిక దూరం పాటించాలని , చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు . కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్ర మత్తంగా వ్యవహరిస్తోందని , వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్ , టెస్టింగ్ , ట్రీటింగ్ విధానాన్ని అవలంభిస్తున్నామని వివరిం చారు .
