లక్షల్లో వస్తున్న జనం, పెరుగుతున్న ఉద్రిక్తత
1 min read
Farmers Republic Day 640
ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ ప్రాంతా ల్లో మూడు సాగు చట్టాల రద్దును కోరుతూ ఆందోళనను కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 2 వ తేదీ నాటికి శిబిరాల వద్ద లక్షల్లో జనం ఉంటారన్నది ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల నుంచి రైతులతోపాటు ఈ ఆందోళనకు మద్దతునిస్తున్న వారు కూడా భారీ సం ఖ్యలో ఢిల్లీ శివార్లకు చేరుకుంటున్నారు. వేలాది మంది ఇంకా తరలి వస్తున్న నేపథ్యంలో, రహదారులన్నీ వాహనాలు, బ్యానర్లు, త్రివర్ణ పతాకాలతో నిండిపోయాయి .
రైతు నేతలు చౌదరి చరణ్ సింగ్, మహేంద్ర సింగ్ తికాయత్ ఫొటోలను ప్రదర్శిస్తూ, వారి స్ఫూర్తితో ఉద్య మాన్ని కొనసాగిస్తామని రైతులు శపథాలు చేస్తున్నారు. సిపిఐ , సిపిఎం , కాంగ్రెస్ , టిఎంసి , ఆప్ , ఆర్ఎల్ డి తదితర పార్టీలు రైతుల ఆందోళనకు అండగా ఉన్నాయి . ఆయా పార్టీల శ్రేణులు కూడా భారీ సంఖ్యలో రావడంతో, నిర సన శిబిరాలన్నీ జన సంద్రాలవు తున్నాయి . ఫిబ్రవరి రెండో తేదీ నాటికి రికార్డు స్థాయిలో జనం ఢిల్లీ సరిహద్దులో ఉంటారని సంయుక్త కిసాన్ మోర్చాతోపాటు భారతీయ కిసాన్ యూనియన్ ( బికెయు ) లో పలు వర్గాలకు చెందిన నాయ కులు ధీమా వ్యక్తం చేస్తున్నారు . కనీవినీ ఎరుగని రీతిలో ‘ మహాపంచాయత్’కు లక్షల మంది వస్తారని పేర్కొంటు న్నారు . కేంద్రం వెంటనే స్పందించి సాగు చట్టాలను రద్దు చేయాలని కోరారు .
ఉద్యమం పై కుట్ర…!! కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనకు అన్ని ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తున్నది . మేము సైతం అం టూ లక్షలాదిగా రైతులు , మద్దతుదారులు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోని నిరసన శిబిరాలకు వచ్చి చేరుతున్నారు . గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో చోటు చేసుకున్న కొన్ని హింసాత్మక సంఘటనలను సాకుగా చూపి , ఎర్ర కోట వద్ద ఖల్సా జెండా ఎగరేయడాన్ని జాతి ద్రో హంగా చిత్రీకరించి ఉద్యమాన్ని నీరుగార్చాలన్న అధికారుల కుట్రలు ఫలించలేదు . గురు , శుక్రవా రాల్లో ఘజియాబాద్ , సింఘు , ఘాజీపూర్ తదిత ర ప్రాంతాల నుంచి రైతులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు . మరోవైపు స్థానికులమని తమను తాము ప్రకటించుకున్న కొంత మంది హఠాత్తుగా రైతు నిరసన శిబిరాలపై రాళ్లు రువ్వి , దాడులు చేసి , భయానక వాతావరణాన్ని సృష్టించారు . పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని పేర్కొంటూ రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు నీటి ఫిరంగులను ఉప యోగించారు . లాఠీచార్జి చేశారు .
మరోవైపు ఢిల్లీ పోలీస్లు పలువురు మూడు వ్యవసాయ చట్టాలపై ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చర్చ జరిపి తీరాలని సిపిఐ , సిపిఎం , టిఎంసి , కాంగ్రెస్ సహాపలు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి . బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం సంప్రదాయం మేరకు నిర్వహించే అఖిలపక్ష సమావేశం శనివారం జరిగింది . దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ సమావేశంలో అన్ని ప్రధాన ప్రతిపక్షాలు కూడా బడ్జెట్ సమావేశాల్లో రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరగాల్సిందేనని కోరాయి . గణతంత్ర దినోత్స వం నాడు ఎర్రకోట దగ్గర జరిగిన హింస , విధ్వంసకాండను ముక్త కంఠంతో ఖండించాయి . అయితే , ఇంకా శాంతియుతంగా నిరసన చేస్తున్న ఇతర రైతులను సంఘటనకు బాధ్యులను చేయవద్దని విపక్షాలు స్పష్టం చేశాయి .
రైతులు , ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో రైతు చట్టాలపై వ్యవసాయ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉందని , రైతులకు ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ పిలుపు దూరంలోనే ఉందని నరేంద్ర సింగ్ తోమర్ చెప్పిన దానినే మోడీ పునరుద్ఘాటించారని ప్రహ్లాద్ జోషీ తెలిపారు . ఇక పార్లమెంట్ సమావే శాలు సాఫీగా జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన మోడీ , చర్చలకు అంతరాయం ఏర్ప డటం వల్ల ప్రశ్నలు వేసే అవకాశం రాకపోవడంతో చాలావరకు చిన్న పార్టీలే నష్టపోతాయన్నారు మోడీ . అందుకని పార్లమెంట్ విధులు సవ్యంగా సాగేందుకు ప్రధాన పార్టీలు హామీ ఇవ్వాలని , అప్పుడే అవాంతరాలు ఉండవని , అలా చిన్న పార్టీలకూ తమ గొంతు విప్పే అవ కాశం వస్తుందని మోడీ వ్యాఖ్యానించారని ప్రహ్లాద్ జోషీ తెలిపారు . శాసన వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ ఎజెండాను రాజకీయ పక్షాల ముందుంచేందుకు అఖిల పక్ష సమా వేశం నిర్వహిస్తారు . సమావేశంలో వివిధ పార్టీల నాయకులు సమావేశాల్లో తాము లేవనెత్తే అంశాలను అఖిల పక్ష సమావేశంలో పేర్కొంటారు .
కాలిఫోర్నియాలో మహాత్మా గాంధీ విగ్ర హాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రధానమంత్రి ఖండించారని జోషీ వెల్లడించారు . అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం నబీ ఆజాద్ , తృణమూల్ ఎంపి సుదీప్ బంద్యోపాధ్యాయ , శిరోమణి అకాలీ దళ్ తరఫున బల్వీందర్ సింగ్ భుందేర్ , శివసేనకు చెందిన వినాయక్ రౌత్ తదితరులు నిరసన చేస్తున్న రైతుల అంశాన్ని లేవనెత్తారని సమాచారం . ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని బిజూ జనతా దళ్ ( బిజెడి ) డిమాండ్ చేసింది . దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ , తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతిచ్చాయి . ఇక ప్రభుత్వం మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ శనివారం విజ్ఞప్తి చేసింది . అయితే రైతు సమస్యలపై చర్చ కోసం ప్రధానమంత్రి తప్ప కుండా ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తృణమూల్ ఎంపి సుదీప్ బంద్యోపాధ్యాయ పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ప్రసంగాన్ని 20 విపక్షాలు బహిష్కరించడమే వ్యవ సాయ చట్టాలను రద్దు చేసేందుకు ప్రభుత్వానికి బలమైన సందేశమని టిఎంసి ఎంపి సుదీప్ బంద్యోపాధ్యాయ పేర్కొన్నారని సమాచారం .
