May 12, 2025

Digital Mixture

Information Portal

కోర్టు అధికారులకే కోర్టు నోటీసులు…

1 min read
కోర్టు అధికారులకే కోర్టు నోటీసులు...

కోర్టు అధికారులకే కోర్టు నోటీసులు...

హైకోర్టు అధికారులకే కోర్టు ధిక్కార నోటీసులు, న్యాయచరిత్రలో తొలిసారి, కోర్టుల ప్రతిష్ట కోసమేనన్న న్యాయమూర్తి. విచారణ వచ్చే నెల 5 కు వాయిదా వేసిన హైకోర్టు…

ఇప్పటి వరకూ కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని ప్రభుత్వ అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు అందడం చూశాం. ఇప్పుడు న్యాయ చరిత్రలో తొలిసారి హైకోర్టు అధికారులకే కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. హైకోర్టు రిజిష్టార్ (జుడీషియల్) ఆలపాటి గిరిధర్, మరో రిజిష్ట్రార్ ఎన్.మురళీధర్ రావు ఇతర సిబ్బందికి శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.దేవానంద్ కోర్టు ధిక్కార నోటీసులిచ్చారు .

ఈ నోటీసు అందుకున్న వారిలో కొందరు సెక్షన్ ఆఫీసర్లు , అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు , డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ , ఎగ్జామినర్, అసిస్టెంట్లుగా చేస్తున్నవారున్నారు. విచారణ ఫిబ్రవరి 5 కి వాయిదా పడింది . ఒక ఉద్యోగికి ఇన్ స్పెక్టర్ ఆఫ్ సర్వేగా ప్రమోషన్ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదని కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. ఇందులో ప్రతివాది సిద్ధార్థ జైన్ కి హైకోర్టు గత ఏడాది నవంబర్ 30 న నోటీసులు ఇచ్చింది. ఇతర కోర్టు ధిక్కార కేసుల్లోనూ ఇదే మాదిరిగా నోటీసులు జారీ చేసి విచారణను గత నెల 14 కి వాయిదా వేసింది. అయితే వారెవరికీ కోర్టుధిక్కార నోటీసులు జారీ కాలేదు. పైగా, ఆ తేదీకి కేసుల విచారణ జాబితాలో కూడా లేదు . కోర్టు ధిక్కార నోటీసులు డిసెంబర్ 17 న పంపారు. ఈ విషయాన్ని న్యాయమూర్తి గమనించి కోర్టు ఆదేశాల్ని వెంటనే అమలు చేయని సిబ్బందిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజే యాలని హైకోర్టు రిజిష్ట్రీని ఆదేశించారు. సంక్రాంతి సెలవుల కారణంగా కొంత సమయం కావాలని రిజిష్ట్రార్ జనరల్ ఈ నెల 18 న కోర్టును కోరారు . అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

ఈ పరిణామాల తర్వాత న్యాయమూర్తి సుమోటోగా ఇద్దరు రిజిష్టార్లు , పలువురు సిబ్బందికి కోర్టుధిక్కార నోటీసులు ఇచ్చిన కేసులు శుక్రవారం విచారణకు వచ్చాయి . ఈ కేసులో హైకోర్టుకు సహక రించాలని ఎజి ఎస్.శ్రీరామ ను న్యాయమూర్తి కోరారు . తాను సహకరిస్తా నని , కోర్టుల ప్రతిష్ట కాపాడే బాధ్యత హైకోర్టు అధికారులకు కూడా ఉందని ఎజి చెప్పారు . న్యాయస్థానాల హుందాతనం , ప్రతిష్టలను కాపాడ టమే తన ఉద్దేశమని న్యాయమూర్తి స్పష్టం చేశారు . కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ అధికారులైనా కోర్టు అధికారులైనా ఒక్కటేన న్నారు . కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో నోటీసులు ఇస్తున్నా మని , కౌంటర్లు దాఖలు చేశాక తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటిం చారు . విచారణను ఫిబ్రవరి 5 కి వాయిదా వేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *