May 12, 2025

Digital Mixture

Information Portal

మరో 20 మందికి కొత్త రకం కరోనా- New Covid-19 Stain cases rising in India

1 min read
New Covid 19 Stain Cases Rising In India

New Covid 19 Stain Cases Rising In India

భారత్ లో మరో 20 మందికి కొత్తరకం యుకె వేరియంట్ కరోనా వైరస్ నిర్ధారణ అయింది . దీంతో బ్రిటన్లో పురుడు పోసుకున్న కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య 58 కి చేరింది. కాగా కొత్తగా నిర్ధారణ అయిన కేసులను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ( ఎన్ఏవీ ) లో గుర్తించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బాధితులందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను గుర్తించిన సింగిల్ రూమ్ ఐసోలేషన్లో ఉంచినట్లు పేర్కొంది. పాజిటివ్ వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. కాగా , 58 కేసుల్లో 8 నమూనాలను ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ ( ఎన్‌సిడిసి ) లో పరీక్షించగా పరివర్తన చెందిన యుకె స్ట్రెయిన్ కరోనా వైరస్ బయటపడింది . అదే విధంగా 11 శాంపిళ్లను ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంట్రాగేటివ్ బయోలాజీ ( ఐజి ఐబి ) లో, ఒక నమూనాను కల్యాణి ( కోల్ కతా సమీపంలో ఉన్న ) నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ ( ఎన్ఏబిఎంజి ) లో, 25 కేసులను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో, మూడు శాంపిళ్లను హైద రాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలార్ బయాలాజీ ( సిసి ఎంబి ) లో, మరో పదింటిని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఆసుపత్రి ( ఎస్ఎఎంహెచ్ఎఎస్ఎస్ ) లో పరీక్షించగా కొత్త రకం వైరస్ బయటబడింది .

బెంగళూరు ఎసిబిఎస్ ఇన్ స్టీమ్ వద్ద ఉన్న ఇన్స్కాబ్ ల్యాబ్స్, హైదరాబాద్ లోని సిడిఎ 2, భువనే శ్వర్ లోని ఐఎఎస్, పుణెలోని ఎన్‌సిసిఎలో ఇప్పటి వరకు ఎలాంటి యుకె కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూడలేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది . బ్రిటన్లో వెలుగుచూసిన ఈ కొత్తరకం వైరస్ ఇప్పటికే డెన్మార్క్ , నెద ర్లాండ్స్ , ఆస్ట్రేలియా , ఇటలీ , స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ , కెనడా , జపాన్ , లెబనాన్, సింగపూర్ వంటి పలు దేశాలకు వ్యాపించిన విషయం తెలిసిందే. భారత్ లోనూ ఈ రకం కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది . వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా యుకెకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది . ఆంక్షల కంటే ముందే భారత్ కు వచ్చిన యుకె ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించింది . వీరిలో పలువురికి కరోనా పాజిటివ్ గా తేలడంతో కొత్తరకం వైరస్ నిర్ధారణ కోసం పరీక్షలు చేపట్టింది. ఇప్పటివరకు యుకె నుంచి వచ్చిన 38 మందికి స్టెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది . నవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్య 33 వేలకు పైగా మంది బ్రిటన్ నుంచి భారత్ కు తిరిగొచ్చినట్లు కేంద్రం తెలిపింది . వీరిందరినీ గుర్తించిన ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయని వెల్లడించింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *