టిపిసిసి ఎంపికలో మరో కొత్త కోణం- Who is the new president of TPCC?
1 min read
Tpcc New President
కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు . ఎవరికి వారు పోటీ పడుతున్న వేళ రోజు నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ముందుకు రావడం లేదు . ఉత్తమ్ రాజీనామా చేస్తే తదుపరి నేత ఎవరన్నది ముందే నిర్ణయించుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యింది . కాంగ్రెస్ పటిష్టత సంగతి ఎలా ఉన్నా పదవు లకోసం పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది . కాంగ్రెస్ లో ఇలాంటి రాజకీయాలు అందరికీ అనుభమే . అలాగే అనుబంధ పదవుల పైనా పోటీ నెలకొంది . ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పై అప్పుడే సిగపట్లు మొదలయ్యాయని సర్వ విమర్శలు ఉన్నాయి . సొంత టీమ్ లు సిద్ధం చేసుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జోరందుకున్నాయి . ఈ క్రమంలో పార్టీలో చర్చ జరగుతోంది .
పిసిసి చీఫ్ ఎవరన్నది ఇంకా తేలక ముందే మహిళా కాంగ్రెస్ ఎవరన్న దానిపైనా చర్చ సాగుతోంది. అలాగే ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మహిళలు ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై ప్రచారం జరగడం వెనక కూడా కొందరు నాయకులు వ్యూహం ఉందన్నదనీ గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ విషయంలోనే ఎమ్మెల్యే సీతక్క మాజీ మంత్రి కొండా సురేఖ మధ్య పోటీ ఉన్నట్లు సమాచారం , ఇద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నాయకులే కావడంతో ఓరుగల్లు రాజకీయం కూడా వేడెక్కుతోంది . కొత్త వీనీనీ చీఫ్ ఎంపిక సందర్భంగా దీనికి సంబంధించి ఇంఛార్జ్ మాణిక్యం తగూర్ అభిప్రాయ సేకరణ నిర్వహించారు . ఆ సమయంలో మాజీ మంత్రి కొండా సురేఖకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనే ప్రస్తావన వచ్చినట్టు సమాచారం . అప్పటి నుంచి వరంగల్ జిల్లా నాయకుల్లో కొత్త చర్చ మొదలైంది . ఈ చర్చ ఇక్కడితో ఆగకుండా … ఎమ్మెల్యే సీతక్టుకు మహిళా కాంగ్రెస్ పదవి ఇస్తారని కూడా చర్చ తెరమీదకు వచ్చింది . మరోవైపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎవరన్న దానిపై చర్చ సాగుతోంది . సురేఖకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే .. పార్టీలో పట్టు సాధిస్తారని .. అప్పుడు సీతక్కకు పదవి ఇచ్చినా ఇబ్బంది ఉండదని అంటున్నారు . ఇప్పటికే పార్టీలో సీతక్క రేవంత్ వర్గానికి చెందిన మనిషి అని ముద్రపడిన సందర్భంగా .. ఈ కొత్త చర్చ జోరందుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . అందుకే కొత్త పీసీసీ టీమ్ లో ఆమెకు మహిళా కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది .. అయితే మహిళా కాంగ్రెస్ పదవి కంటే వర్కింగ్ పెసిడెంట్ పదవి పార్టీలో కీలకంగా భావిస్తున్నారు . ఇందిరా శోభా , మరో కాంగ్రెస్ నేత సునీతారావు సైతం మహిళా కాంగ్రెస్ చీఫ్ పోస్ట్ పై కన్నేశారని అంటున్నారు . ఎవరికి ఏ పదవి అన్నది ఢిల్లీ ఇంకా తేల్చలేదు . అక్కడి నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు . కానీ .. ఈలోపుగా ఇక్కడి నేతల మధ్య పదవుల విషయమై అప్పుడే చర్చ జరుగుతోంది . దీనిని కమిటీ కొలిక్కి రాకుండానే మహిళా కాంగ్రెస్ చీఫ్ పదవిపై చర్చ జరగడం గమనార్హం , రానున్న రోజుల్లో ఈ తగాదాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి .
