May 12, 2025

Digital Mixture

Information Portal

కొత్త తరహలో హైదరబాద్ మేయర్ ఎన్నికలు…

1 min read
Hyderabad Mayor 2021, Hyderabad Mayor,

Hyderabad Mayor Elections

మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియను మహానగర పాలక సంస్థ ( జిహెచ్ఎంసి ) వేగవంతం చేసింది. ఈ నెల 11 వ తేదీన మేయర్ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెల్సిందే. అయితే ఈసారి ఎన్నికను బారీకేడ్ల మధ్య నిర్వహించనున్నారు. మేయర్ కుర్చీకి ఎడమవైపున ప్రవేశ ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి హాలు మధ్య భాగం వరకు, ముందు వరసల్లో అధికార పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యుల వెనక కార్పొరేటర్లు కుర్చుకుంటారు. టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ఎక్స్ ఆఫిషియో సభ్యులు, కార్పొరేటర్లు కుర్చుంటారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు కుర్చీల కేటాయింపు జరిగింది. ఆయా పార్టీల సభ్యులు మేయర్ కుర్చీకి ఎదురుగా ఉండే రెండవ ద్వారం నుంచి సమావేశ మందిరంలో రావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి జిహెచ్ఎంసి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సభ్యులు పార్టీల వారిగా కేటాయించిన సీట్లలోనే కూర్చునేలా అధికారులు బారికేడ్లతో కూడిన జాలీని నిర్మించాలని నిర్ణయించారు.

జిహెచ్ఎంసి చరిత్రలోనే బారికేడ్ల ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహించడం మొదటిసారి కావడం విశేషం. 150 మంది సభ్యులు =, ఎక్స్ అఫిషియో సభ్యులు సమావేశ మదిరానికి హాజరకానున్నారు. బారికేడ్లు లేకుంటే పార్టీల వారిగా సభ్యులను గుర్తించడం కష్టంగా ఉంటుందని అధికారుల అభిప్రాయంగా ఉంది. జాలీ ఏర్పాటు చేస్తే ఏ పార్టీకి ఆ పార్టీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. మేయర్ గా పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా చేతులు ఎత్తిన సభ్యులను లెక్కించడం సులువుగా ఉంటుందని అధికారులు చెప్పుతున్నారు. 11 వ తేదీన ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం చేయిస్తారు. 12:30 గంటలకు మేయర్ , డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభిస్తారు. సమావేశానికి 149 మంది కార్పొరేటర్లు , 44 మంది ఎఫిషియో సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. 150 డివిజన్ ఎన్నికలు జరగగా, లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ గుండెపోటుతో మరణించారు. 193 మందికి సీట్లను కేటాయించారు. ఈ మేరకు ఎక్స్ ప్రైఫిషియో సభ్యులు , కార్పొరేటర్లకు జిహెచ్ఎంసి అధికారులు ఆహ్వానాలు పంపిస్తున్నారు .

పార్టీల వారిగా బలాబలాలు …

టిఆర్ఎస్ కార్పొరేటర్లు 56, ఎఫిషియో 32, మొత్తం 88.

బీజేపీ కార్పొరేటర్లు 47, ఎఫిషియో 2, మొత్తం 49.

ఎంఐఎం కార్పొరేటర్లు 44, ఎఫిషియో10, మొత్తం 54

కాంగ్రెస్ 2, ఎఫిషియో0, మొత్తం 2.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *