May 12, 2025

Digital Mixture

Information Portal

సామాన్యుడికి గ్యాస్, పెట్రోల్, డీజిల్ రూపంలో కేంద్రం వాత – పెరిగిన ధరలు

1 min read
Petrol, Diesel, LPG gas Prices increased

Petrol, Diesel, LPG gas Prices increased

పెట్రో ధరలను పెంచక తప్పదంటూ లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన వాస్తవ రూపం దరుస్తున్నది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకి సామాన్యుడికి చుక్కలు చూపుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలెండర్ ధర కూడా పెరగడం ఇప్పటి వరకు రికార్డు స్థాయికి ధరలు చేరగా.. తాజాగా గ్యాస్ ధరలు కూడా పెరిగి, బడుగుజీవికి చుక్కలు చూపెడుతున్నాయి .

కేంద్రం తీసుకున్న నిర్ణయాల మేరకు చమురు కంపెనీలు మరోసారి ధరలను పెంచాయ. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ , డీజిల్ పై 35 పైసల చొప్పున పెంచేశాయి. తాజా గా పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ లీట రకు రూ .86.65 , డీజిల్ ధర లీటర్ కు రూ .76.83 కు చేరింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధర సుమారు రూ .14 పెరగడం గమనార్హం. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటర్ ధర రూ .90.10, డీజిల్ రూ . 83.81 కు దూసుకెళ్లాయి. ముంబయిలో పెట్రోల్ రూ .93.20 , డీజిల్ రూ .83.73 , కోల్ కతాలో పెట్రోల్ రూ .88.01, డీజిల్ రూ .80.41, చెన్నైలో పెట్రోల్ రూ .89.13 , డీజిల్ రూ .82.04 , బెంగళూరులో పెట్రోల్ రూ .89.54 , డీజిల్ రూ .81.44 , నోయిడాలో పెట్రోల్ రూ .85.91 , రూ .77.24 , గురుగ్రామ్ లో పెట్రోల్ రూ .84.72 , డీజిల్ రూ .77.39 కు చేరి , వంద రూపాయల మైలురాయికి దగ్గరవుతున్నాయి. మొత్తం మీద, ఒకవైపు పెట్రో మంట, మరోవైపు వంట గ్యాస్ ధర పెంపు సామాన్య ప్రజల్లో గుండెల్లో బాంబులై పేలుతున్నాయి.

దేశంలో ఇప్పటికే ఆకాశాన్ని అంటుతున్న పెట్రో ధరలతో ప్రజలు నానా తంటలు పడుతుండగా, పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర సెగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బడ్జెట్ రోజైన ఒకటో తేదీన వంట గ్యాస్ ధరలను యథాతథంగా ఉంచినా, తాజాగా రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయంచాయి. ఈ కొత్త ధరలు గురువారం నుండి అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామంతో వంట గ్యాస్ సైతం గుదిబండగా మారింది. చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎల్ పీజీ సిలిండర్ ధర తాజాగా 25 రూపాయలు, వాణిజ్య సిలిండర్ ధర 184 రూపాయలు చొప్పున పెరిగాయి. ప్రస్తుత ధరల పెంపు తరువాత హైదరాబాద్లో వినియోగదారులు సిలిండరు రూ .771.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర రూ .746.50 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోలు సిలిండర్ ధర రూ .664 నుంచి రూ . 719 కి పెరిగింది . కోల్‌కతాలో రూ .745.50 , ముంబైలో రూ .719 , చెన్నైలో రూ .735 కి చేరింది . అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న పెట్రో ధరల నుంచి ప్రజలకు ఇప్పట్లో విముక్తి లభించే అవకాశాలు కనిపించడం లేదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *