మళ్ళీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
1 min read
Bf341562 6c3b 11eb Ab1c Fc518c9ec29f 1613029332935
దేశంలో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. వరుసగా మూడవ రోజు ఇంధన ధరలు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ. 88 కి చేరువైంది. ముంబయిలో డీజిల్ ధర రూ. 85 కు చేరింది. దేశీయ చమురు కంపెనీలు గురువారం లీటర్ పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 30 పైసలను వడ్డించాయి. తాజాగా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర అత్యంత గరిష్టంగా రూ .87.85 కు ఎగబాకగా, ముంబయిలో అత్యధికంగా రూ. 94.36 కు పెరిగింది. అదే విధంగా డీజిల్ ధరలు కూడా ఢిల్లీలో రూ.78.03 కు చేరగా, ముంబయిలో ఎప్పుడూ లేనంతగా అత్యంత గరిష్టంగా రూ. 84.94 కు పెరిగాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఆటో రిక్షా డ్రైవర్ల జీవనోపాధికి తీవ్రం భంగం వాటిల్లుతుంది . మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో అదనపు ఆదాయం కోసం ఆటోరిక్షా డ్రైవర్లు మరికొన్ని గంటల పాటు శ్రమిస్తున్నారు. కాగా, ఒకవైపు పెట్రో ధరలు ఆకాశాన్నంటుతుంటే మరోవైపు ఆ శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని రాజ్యసభలో వెల్లడించడం గమనార్హం.
అంతర్జాతీయ ధరలు, విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరిస్తుంటాయి. అయితే వ్యాట్, ఇతర పన్నులతో వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. వరుసగా మూడు రోజులుగా ఇంధన పెరగగా, ఈ మూడు రోజుల్లో పెట్రోల్, డీజీలకు 90 పైసల చొప్పున పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో డిమాండ్ లో పెరుగుదల ఉండడంతో దాదాపు ఏడాది తరువాత మొదటిసారిగా బ్రెంట్ ముడి చమురు ధర ఒక బారలకు 61 కిపైగా యుఎస్డి లు పెరిగింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం టాక్స్లు పెంచిన తరువాత మార్చి 2020 మధ్యస్థం నుంచి రిటైల్ పెట్రోల్ ధరలు రూ.18.26 పెరగగా, డీజిల్ ధరలు రూ.15.74 పెరిగాయి .
ఇలా అయితే ఎలా బతికేది ! పెట్రో ధరలు రోజు రోజుకు భగ్గుమంటున్న నేపథ్యంలో తాము ఎలా బతకాలని ఆటోరిక్షా డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు తాము రోజు ఉదయం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేసే వారమని, కానీ ఇప్పుడు ఇంధన ధరలు పెరగడం వల్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొని తమ కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెల్లవారుజాము నుంచి ఆటో నడపాల్సి వస్తుందని కొంతమంది డ్రైవర్లు చెబుతున్నారు. ఔరంగాబాద్ లో ఇన్ డెడ్ పెట్రోల్ లీటరుకు రూ .95.27 కు చేరగా, పెట్రోల్ , ఇతరత్రా కలుపుకొని రూ.98.13 కు విక్రయిస్తున్నారు . దీంతో తమ సంపాదనలో తీవ్ర కోతపడిందని , ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు ఆటో నడిపితే దాదాపు రూ.200 మాత్రమే లాభం వస్తుందని ఓ ఆటోడ్రైవర్ వాపోయారు. రోజుకు రూ.400 సంపాదిస్తే అందులో ఇంధనం కోసం రోజుకు రూ.230 వెచ్చిస్తున్నామని మరో డ్రైవర్ తెలిపారు. తాను రోజుకు రూ.300 సంపాదిస్తే అందులో రూ.110 ఇంధానికే అవుతుందని, మరో రూ.100 ఆటో అద్దె చెల్లిస్తున్నానని, దీంతో తన సంపాదన రూ.100 మాత్రమేనని మరో డ్రైవర్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు .
