May 12, 2025

Digital Mixture

Information Portal

Big News: టాలీవుడ్ నుండి మరో మెగా పాన్ ఇండియా మూవీ… రామ్ చరణ్ –శంకర్ కాంబో లో సినిమా ఫిక్స్…

1 min read
Ram Charan Shankar Movie

Ram Charan Shankar Movie

తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్…

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకి ఇది 50వ సినిమా…

కొన్ని కాంబినేషన్స్ ని కలపడం, సినిమా తీయడం  అంటే అంత మామూలు విషయం కాదు. కానీ దిల్ రాజు అలాంటి కాంబో లో సినిమాని నిర్మించనున్నాడు. అదే రామ్ చరణ్, శంకర్ కాంబో. సాధారణంగా కొన్ని  కాంబినేషన్స్  లో సినిమా రావాలని, తమ హీరోని అలాంటి సినిమాలో చూడాలని  ఫ్యాన్స్ కోరుకుంటారు. కానీ అలాంటివి కోరికలగానే ఉంటాయి. కానీ మెగా ఫ్యాన్స్ , సినిమా అభిమాని ఊహించని విధంగా రామ్ చరణ్, శంకర్ కలయికలో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా twitter ద్వారా ప్రకటించింది.

ఒకరకంగా చెప్పాలంటే శంకర్ తో సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి కోరిక. అన్ని కుదిరితే చిరంజీవి తన రీఎంట్రీ మూవీ శంకర్ తో తీయాలని అనుకున్నారు. శంకర్ తో సినిమా చేయాలని ఉంది అని రోబో సినిమా ఫంక్షన్ లో చిరంజీవి తన కోరికని బయట పెట్టారు. కానీ అది కోరికగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు.

RC15, Ram Charan 15th Movie, Ram Charan Shankar Combo Movie,
Ram Charan Shankar Combo Movie- Twitter / @AlwaysRamCharan

చిరంజీవి కోరికను, తనయుడు రామ్ చరణ్ తీరుస్తున్నాడు. తండ్రిని మించిన తనయుడిగా శంకర్ తో సినిమా చేసే అవకాశాన్ని పొందాడని చెప్పొచ్చు. రామ్ చరణ్ 15 ( RC15)వ సినిమా  గా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కి ఇది 50వ సినిమా. ఇది ఒక మైలు రాయి. “SVC నుండి 50 చిత్రం తో ఇంతకూ ముందెప్పుడూ  చూడని రెండు బలమైన శక్తులను కలిపి మీ ముందుకు రాబోతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ది షో మాన్ ఆఫ్ ఇండియన్ సినిమా శంకర్ గారితో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది” అని SVC సంస్థ twitter ద్వారా తెలిపింది.

ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ తో పాటు సోషల్ మెసేజ్ ఆధారంగా సినిమా ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే రామ్ చరణ్ కి తగ్గట్టు ఎలాంటి సోషల్ మెసేజ్ కథ తో రాబోతున్నాడని ఫ్యాస్స్ ఆలోచనలు మొదలు పెట్టారు.

ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు -2 సినిమా చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా మళ్ళీ తిరిగి ప్రారంభం అవ్వలేదు. అయితే శంకర్ భారతీయుడు సినిమా తరువాత రామ్ చరణ్ సినిమా ఉంటుందా లేక ఆ సినిమా పక్కన పెట్టి ఈ సినిమా మొదలు పెడతారా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *