త్వరలో OTT లో విడుదల కానున్న రామ్ “రెడ్”…
1 min read
Ram's Red Ott Release
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమా “రెడ్” త్వరలో ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) ద్వారా విడుదల అవుతోంది. “ఇస్మార్ట్ శంకర్” తరువాత రామ్ రెడ్ సిమిమా తో ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఒక దశలో ఈ సినిమా డైరెక్ట్ OTTలో విడుదల అవుతున్నట్టు ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ సినిమా నిర్మాత స్రవంతి రవికిషోర్ మాత్రం ఈ సినిమాని థియేటర్ల లోనే విడుదల చేయాలని అన్ని సద్దుమనిగిన తరువాత రామ్ రెడ్ సినిమాని థియేటర్ల లో విడుదల చేసి సినిమా ని హిట్ చేసారు.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైం థ్రిల్లర్ సినిమా లో రామ్ తో పాటు మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే కిషోర్, రామ్ కాంబినేషన్లో నేను శైలజ హిట్ ని అందుకున్నారు. ఇప్పుడు రెడ్ సినిమా తో మరొక హిట్ ని తమ ఖాతాలో వేసుకున్నారని చెప్పొచ్చు. ఈ సినిమా తమిళ సినిమా “తడక్” కి రీమేక్.
రామ్ ఫ్యాన్స్ రెడ్ సినిమా ఎప్పుడెప్పుడు OTT లో విడుదల అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఈ నెల 23 వ తేదీన ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో విడుదల కానుంది. దీనితో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
