May 12, 2025

Digital Mixture

Information Portal

“వీరయ్య”గా రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి…

1 min read
Megastar As Veeraiah, Megastar Chiranjeevi, Acharya

Megastar As Veeraiah

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల స్పీడును పెంచుతున్నాడని చెప్పొచ్చు. సైరా సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి. కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ మద్యనే ఆచార్య ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇందులో తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలోని లిరికల్ సాంగ్ ని త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి కి సరసన కాజల్ నటిస్తోంది. ఈ సినిమాని మే 13 వ తేదీకి విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

 ఆచార్య తరువాత వరుస బెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మెగాస్టార్. కానీ ఇందులో రీమేక్ లు కూడా ఉన్నాయి. ఒకటి మళియాళం లో భారీ విజయాన్ని సాధించిన లూసిఫర్ తరువాత  వేదాళం సినిమాని రీమేక్ చేయనున్నాడు.

అయితే ఈ రెండు సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని చాలా రోజుల క్రితమే  స్వయంగా చిరంజీవి ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా కి సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే వీరిద్దరి కలయికలో ఒక రీయల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకి “వీరయ్య” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. ఈ సినిమాని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.  

మరి “వీరయ్య” టైటిల్ ఫైనల్ అవుతుందా లేదంటే మరొక టైటిల్ పెడతార అనేది తెలియాలంటే,  అధికారిక ప్రకటన వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *